Sunday, September 8, 2024

అట్టాహాసంగా నామినేషన్లు

- Advertisement -

అస్థిరపరచడానికి వచ్చిన  వాళ్లా నా పై పోటీ

మెదక్, నవంబర్ 9, (వాయిస్ టుడే): తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, బీఆర్ఎస్ ను అస్థిర పర్చడానికి రేవంత్ రెడ్డి  రూ.50 లక్షల నగదుతో అడ్డంగా దొరికిపోయాడని కేసీఆర్  విమర్శించారు. అలాంటి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో  తనపై పోటీకి దిగుతున్నాడని కేసీఆర్ ఆక్షేపించారు. దీనిపై కామారెడ్డి ప్రజలే బుద్ధి చెప్పాలని కేసీఆర్ కోరారు. కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్  పాల్గొన్నారు. విచక్షణతో ఓటు వేయాలని ప్రజలను కోరారు.రైతు బంధు వద్దని, 24 గంటల కరెంటు వద్దని అనేవాడు కావాలా? రైతులను కడుపులో పెట్టుకొని చూసేవాడు కావాలా? అని అడిగారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి  నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్ మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. గజ్వేల్ లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ప్రచారం వాహనం పై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ కామారెడ్డి చేరుకున్న ఆయన, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, సోమ భరత్ ఉన్నారు. మరోవైపు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సైతం నామినేషన్లు వేశారు. తొలుత సీఎం కేసీఆర్, తల్లి శోభ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. సిద్ధిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో మంత్రి హరీష్ రావు సైతం నామినేషన్ దాఖలు చేశారు. అగ్రనేతల నామినేషన్లతో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల సందడి నెలకొంది.బీఆర్ఎస్ అగ్రనేతలు సైతంఅటు, బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్సులో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.

Ridiculous nominations
Ridiculous nominations

ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆయనపై కత్తితో దాడి చేయగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావుతో కలిసి గురువారం ఆర్డీవో కార్యాలయానికి వీల్ చైర్ లో వచ్చి నామినేషన్ వేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ,సికింద్రాబాద్ లోని నార్త్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నామినేషన్ వేశారు. ఈ సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కూడా అప్పుడే నామినేషన్ వేసేందుకు వెళ్లగా, పోలీసులు ముందుగా బాల్క సుమన్ వాహనాన్ని అనుమతించారు. దీంతో వివేక్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటు, సూర్యాపేట, మహబూబ్ నగర్ లో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డి ఎడ్లబండిపై రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణుల సందడి నెలకొంది. భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారుల కార్యాలయానికి వెళ్లి అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
గజ్వేల్ లో….  గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌డీవో కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. ఎర్రవ‌ల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గ‌జ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్. నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం గ‌జ్వేల్ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకుని అక్కడ నామినేషన్‌ వేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్