ఇల్లందు వద్ద రోడ్డు ప్రమాదం..  ఐదుగురు మృతి

- Advertisement -

వరంగల్ జిల్లాలో .. తాగి రాంగ్ రూట్‌లో లారీ నడిపి ఆటోను ఢీకొట్టిన డ్రైవర్..

వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ప్రమాదం

ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురి మృతి

బాధితులను తేనె విక్రయించే కూలీలుగా గుర్తింపు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్నఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటోలో చిక్కుకుపోయిన మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

లారీ డ్రైవర్‌ను రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మద్యం మత్తులో లారీని రాంగ్‌రూట్‌లో నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. బాధితులను తేనె విక్రయించే కూలీలని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular