Sunday, February 15, 2026

వైసిపి జగన్ ను వదిలించుకున్న రోజా..!!!

- Advertisement -

వైసిపి జగన్ ను వదిలించుకున్న రోజా..!!! 

Roja got rid of YCP Jagan..!!!

నటీనటులు ఎవరైనా తమ విడాకుల గురించి హింట్ ఇవ్వాలనుకుంటే… సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం.. కలిసి ఉన్న ఫోటోలను తీసేయడం చేస్తారు. ఇప్పుడు నటి కమ్ రాజకీయనాయకురాలు రోజా కూడా అదే చేస్తున్నారు. తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ, జగన్ అనే పేర్లు, బొమ్మలు లేకుండా తీసేశారు. హఠాత్తుగా ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కానీ.. వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి. హెడర్‌లో తన వైసీపీ ఆనవాళ్లు లేవు. బయోలో తాను వైసీపీ నాయకురాలినని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అన్న హోదాలకు పరిమితం అయ్యారు. ఎందుకు ఇలా అన్నది వైసీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. నగరి ఇంచార్జ్ గ రోజా ఉన్నారా లేదా అన్నదానిపై స్పష్టత కావాలని ఆమె అడిగినట్లుగా చెబుతున్నారు. సాధారణంగా పోటీచేసి ఓడిపోయిన వారంతా అక్కడ ఇంచార్జులుగా ఉంటారు. కానీ రోజా పార్టీ కార్యక్రమాలను నిర్వహించే విషయంలో హైకమాండ్ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కేవలం రోజా వల్లనే నగరి వైసీపీ భ్రష్టుపట్టిపోయిందని.. ఆమెను వదిలించుకోవడమే మంచిదన్న వ్యూహంతో పార్టీ పనులు ఏమీ చెప్పడం లేదు. దేనికీ సమాచారం ఇవ్వడం లేదు. కనీసం సమావేశాలకు ఆహ్వానం రావడం లేదు. అందుకే కోపంతో ఇలా చేశారన్న వాదన వినిపిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్