Sunday, September 8, 2024

మౌత్ పబ్లిసీటి భయంలో గులాబీ

- Advertisement -

మౌత్ పబ్లిసీటి భయంలో గులాబీ
హైదరాబాద్, నవంబర్ 16,
సినిమాల విజయంలో  మౌత్ పబ్లిసిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే విషయంలో కూడా మౌత్ పబ్లిసిటీ కీలక పాత్ర పోషిస్తుందనీ, గతంలో సంగతి ఎలా ఉన్నా

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో  మౌత్ పబ్లిసిటీ ప్రాథాన్యత మరింత పెరిగిందనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో దాదాపు మీడియా అంతా ఏకపక్షంగా మారిపోయిన పరిస్థితులలో

మౌత్ పబ్లిసిటీ ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న విషయంపై పరిశీలకులే కాదు పార్టీలు కూడా మౌత్ పబ్లిసిటీ మీదే ఆధారపడుతున్నాయి. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంతగా ప్రతి ఇంటికీ చేరువైన ఈ

రోజులలో కూడా ఎన్నికలు, ఫలితాలు మౌత్ పబ్లిసిటీ మీద ఆధారపడి ఉండటం ఏమిటి వింతగా ఉందే అనిపించక మానదు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు.

స్వాతంత్రోద్యమ సమయంలో  ఇప్పటిలా మీడియా పెద్దగా ప్రజలకు చేరువగాని సమయంలో ప్రజా ఉద్యమాల నిర్మాణంలో మౌత్ పబ్లిసిటీదే ప్రధాన పాత్రగా ఉండేది. మహాత్మాగాంధీ సహాయనిరాకరణ, విదేశీ

వస్తు బహిష్కరణ, దండి  సత్యాగ్రహం వంటి ఉద్యమాలకు ఇచ్చిన పిలుపు ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారానే జనాలకు చేరిందని చెబుతారు. అప్పట్లో మీడియా పాత్ర పరిమితం. అలాగే అక్షరాస్యత కూడా

స్వల్పమే. చదువుకున్న కొద్ది మంది అందుబాటులో ఉన్న వార్తాపత్రికలను చదివి, ఆ విశేషాలను జనాలకు వివరించి చెప్పేవారు. అలా విన్న వారు మరి కొందరికి… విషయం ప్రజలందరికీ చేరేది. ఇందుకు

అప్పట్లో వారం నుంచి పది రోజల సమయం పట్టేదని ఒక  అంచనా. అయితే ఇప్పడు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. అక్షరాస్యులు

కూడా గణనీయంగా పెరిగారు. అయితే మీడియాపై విశ్వసనీయత మాత్రం ఏదో ఒక మేరకు సన్నగిల్లింది. అందులో సందేహం లేదు. తెలంగాణ విషయమే తీసుకుంటే..  రాష్ట్రంలో దాదాపు మీడియా అంతా

అధికార పార్టీ ప్రచారానికే ఎక్కువ సమయం, స్థలం కేటాయిస్తున్న పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత  ఇంచుమించు ప్రతి రోజూ మూడు బహిరంగ సభలలో ప్రసంగిస్తుండటంతో ప్రింట్ మీడియాలో కానీ,

ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ.. ఆయన ప్రసంగానికి సంబంధించిన వార్తే హైలైట్ అవుతోంది. ఇతర పార్టీల ప్రచార కార్యక్రమాలకు కేటాయించే సమయం, స్థలం కూడా తక్కువ అయిపోతోంది. ఈ పరిస్థితుల్లో

గ్రౌండ్ రియాలటీపై వాస్తవాలు జనాలకు ఈ మౌత్ పబ్లిసిటీ ద్వారానే తెలుస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కూడా వివిధ

రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన సందర్భాలలో మీడియాలో ప్రచారం కంటే మౌత్ పబ్లిసిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతారు. మీడియా కంటే మౌత్ పబ్లిసిటీ చాలా

బలంగా ప్రజలలోకి వెడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేసేవారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన ఏపీలో వైసీపీ తరఫున పని చేసిన సంగతి విదితమే. అప్పట్లో పింక్ డైమండ్ మాయం, వివేకా

హత్య, కోడికత్తి దాడి వంటి అంశాలను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలచడంలో ఆయన మీడియా కంటే మౌత్ టాక్ ద్వారా వచ్చే ప్రచారంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అప్పట్లో అది

సత్ఫలితాలను ఇచ్చింది కూడా.   ఇక ప్రస్తుతానికి వస్తే తెలంగాణలో  వాస్తవ ప్రజాభిప్రాయం అంతా మౌత్ టాక్  ద్వారానే వెలుగులోనికి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక

మాధ్యమం, మౌత్ టాక్ విపక్షాలకు ఒకింత మేలు చేస్తున్నాయనీ, అదే సమయంలో  ఎలక్ట్రానిక్ మీడియాలో సింహ బాగం అధికార పార్టీ వార్తల ప్రసారం, ప్రచారానికే పరిమితమైందన్న అభిప్రాయం బలంగా

ఉందని చెబుతున్నారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, జనం తరచుగా వెళ్లే బార్బర్ షాపులు, టీ స్టాల్స్, సామాన్యులు ప్రయాణించే సిటీ బస్సులు, మెట్రో రైళ్ల ద్వారా జనాభిప్రాయం ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఒక

బలమైన మాధ్యమంగా మౌత్ టాక్ మారిపోయిందని అంటున్నారు. ఈఈ ప్రదేశాలలో అత్యధికంగా బీఆర్ఎస్ అవినీతి, పోలవరం ప్రాజెక్టు లోపాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు వంటి విషయాలపై పెద్ద

ఎత్తున చర్చ జరుగుతున్నదనీ, అంతిమంగా ఈ చర్చ అధికార పార్టీకి వ్యతిరేక అభిప్రాయంగా బలపడుతున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్