రోడ్డు ప్రమాదంలో రౌడీ షీటర్ మృతి
హైదరాబాద్
హైదరాబాద్ ఛాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాచిగూడ కి చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ సింగ్ మృతి చెందాడు. సవేరా హోటల్ సమీపం లో అతివేగంగా వచ్చి లారీ ని ఢీ కొట్టి లారీ చక్రాల కింద పడి మృతి చెందాడు. పోలీసులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే కాచిగూడ నివాసి శ్రీకాంత్ సింగ్ స్థానిక పోలీసు స్టేషన్ లో రౌడీ షీటర్ గా నమోదయ్యాడు. ఇతని పై సుల్తాన్ బజార్, లేక్ పోలీస్ స్టేషన్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నాయి. మృతుడి కి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ వుంది. రోడ్ల పై బైక్ స్టంట్స్ చేస్తూ వాటి వీడియోలను ఇన్టాగ్రాంలో అప్ లోడ్ చేస్తూ వుంటాడు. మృతదేహం వద్ద నుండి ఒక సెల్ ఫోన్, ఒక కత్తి ని స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో రౌడీ షీటర్ మృతి
- Advertisement -
- Advertisement -