Wednesday, January 15, 2025

ఎన్‌టీఆర్ ముఖ చిత్రంతో రూ.100 నాణెం విడుదల

- Advertisement -

ఒక్కో నాణెం ధర రూ. 4,160

శకపురుషుడి పేరుతో రూ.100 నాణెం విడుదల

rs-100-coin-with-ntr-face-image-released
rs-100-coin-with-ntr-face-image-released

న్యూఢిల్లీ, ఆగస్టు 28:  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుకి జాతీయ గుర్తింపు దక్కింది  స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను సోమవారం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అదినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబీకులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎంపీలు హాజరయ్యారు.నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరో అదురై దృశ్యం సాక్షాత్కారమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నందున జూనియర్ ఎన్టీఆర్, పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఎన్‌టీఆర్ విశేష సేవలందించారని అన్నారు. పీలోని రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలపైనా ఆయన ప్రభావం చూపించారని వెల్లడించారు.”సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఎన్‌టీఆర్ విశేష సేవలందించారు. ఏపీలోని రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలపైనా ఆయన ప్రభావం చూపించారు. రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్యోధనుడు..ఇలా అన్ని పాత్రల్లోనూ నటించి వైవిధ్యాన్ని చూపించారు. సినిమా సమాజాన్ని ఎలా ప్రభావితం చూపుతుందో నిరూపించారు” రాముడిగానే కాకుండా రావణుడిగా, దుర్యోధనుడిగానూ ఎన్‌టీఆర్ అందరినీ మెప్పించారని కొనియాడారు పురంధేశ్వరి. ఆయన తరతరాలకూ హీరో అని అన్నారు. “ఎన్‌టీఆర్‌ కేవలం కొంత మందికే హీరో కాదని, తరతరాలకు హీరో. శతజయంతి సందర్భంగా ఆయనను ఇలా స్మరించుకోడం గొప్ప విషయం. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన స్మారకంగా రూ.100 నాణెం విడుదల చేయడం చాలా ఉద్వేగమైన క్షణం”

– పురంధేశ్వరి, ఏపీ బీజేపీ ప్రెసిడెంట్, ఎన్‌టీఆర్ కూతురు

రూ.100 నాణెం విడుదల చేసిన తరవాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్‌టీఆర్ సేవల్ని ప్రశంసించారు. ఆయన పేరిట ఇలా ఓ నాణెం విడుదల చేయాలన్న ఆలోచన చాలా గొప్పదని అన్నారు. “ఎన్‌టీఆర్ పేరిట రూ.100 నాణెం విడుదల చేయాలన్న కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించడం గొప్ప విషయం. పురంధేశ్వరి ఈ ప్రక్రియలో ముందు నుంచి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తెలుగు సినిమా ద్వారా దేశ సంస్కృతిని చాటి చెప్పారు. రామాయణ, మహాభారతాలకు ఆయన నటనతో జీవం పోశారు. రాముడు, కృష్ణుడి చరిత్రని అందరికీ చాటి చెప్పారు. ఆయననే రాముడు అనుకునే స్థాయిలో నటించారు”

ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన ఎన్టీఆర్.. స్వయంకృషితో సినీ రాజకీయ రంగాల్లోకి వచ్చి.. తన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత స్థానాన్ని చేరుకుని..ఆ తరువాత తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగు దేశం  పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు.ఎన్టీఆర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని విడుదల చేసింది. రూ.100 నాణెం 44 మిమీ వ్యాసం కలిగి ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో రూపొందించబడింది. దీన్ని ఏదైనా బ్యాంకులో లేదా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు. ఒక్కో నాణెం ధర రూ. 4,160 ఉంటుంది.  నాణెంతో పాటు, తెలుగు ప్రైడ్‌గా పేరొందిన ఎన్టీఆర్‌ చరిత్రాత్మక జీవిత ప్రయాణాన్ని వివరించే నాలుగు పేజీల పుస్తకాన్ని కూడా కొనుగోలుదారులకు అందించనున్నారు. నాణేనికి ఒకవైపు మూడు సింహాలు, అశోకచక్రం ఉండగా, మరో వైపు హిందీలో హిందీలో ‘నందమూరి తారక రామారావు శతజయంతి’ అని చెక్కబడిన ఎన్టీఆర్ చిత్రం ఉంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను సూచించేందుకు నాణెం 1923-2023 సంవత్సరాలతో గుర్తించబడింది.ఈ నాణాన్ని హైదరాబాదులోని మింట్ కాంపౌండ్‌లోనే ముద్రించబడటం విశేషం. అయితే 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యులకే స్వయంగా సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించారు. NTR రూపంతో నాణెం ముద్రించడం పట్ల నందమూరి ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. . ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది

ఎన్టీ రామారావు  నాణెం ఆవిష్కరణ

కార్యక్రమానికి తారక్ దూరం

నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం 100 రూపాయల స్మారక నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణాన్ని విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటుగా నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌ సన్నిహితులు, దాదాపు 200 మంది అతిథులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ రెండో భార్య లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదని సమాచారం. ఇప్పటికే రాష్ట్రపతి భవన్‌కు చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్‌ కూతురు పురందేశ్వరితో పాటుగా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ హాజరు కాలేదు.ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో భాగంగా హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు కానీ, ఆయన హాజరు కాలేదు. కార్యక్రమంలో తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పాల్గొన్నారు. అంతకుముందు విజయవాడలో నిర్వహించిన ఇదే తరహా కార్యక్రమంలో తారక్‌ను ఆహ్వానించకపోవడంపై అభిమానులు ఆందోళన చేశారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న కార్యక్రమంలో దేవర షూటింగ్‌ కారణంగానే హాజరు కాలేదని చెప్తున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ టీడీపీ కోసం ప్రచారం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తారక్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో పొత్తు ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో లోకేష్‌ పాదయాత్ర చంద్రబాబు సభల్లోను తారక్‌ అభిమానులు ప్లెక్సీలు, జెండాలు ప్రదర్శిస్తున్నారు. ఫ్యూచర్‌ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తారక్‌ హాజరు కాకపోవటం వెనుక సినిమా షూటింగ్‌ మాత్రమే కారణమా, లేక కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే అసలు కారణమా అనే చర్చ ఇప్పుడు సినీ, పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. తాతపై ఎంతో అభిమానం ఉన్న తారక్‌.. శతజయంతి సందర్భంగా నిర్వహించిన, నిర్వహిస్తున్న కార్యక్రమాలకు దూరంగా ఉండడం చాలా మందికి నచ్చడం లేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్