- Advertisement -
అమ్మవారిని దర్శించుకున్న ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్
RSS Chief Mohan Bhagwat visited Ammavari
విజయవాడ
శనివారం నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ ఇంద్రకీలాద్రిలోని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.
ఈ సందర్బంగా మోహన్ భగవత్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అయనకు వేదపండితుల తో వేదాశీర్వచనం కల్పించారు. మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆలయ ఈవో అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదములు మరియు చిత్రపటం అందజేశారు.
తరువాత మంత్రి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆలయమునకు రావడంతో అయనకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితుల ఆశీర్వచనం కల్పించి, ప్రసాదములు అందజేసి గౌరవించామని అన్నారు. డిసెంబర్ 21 నుండి 25 వరకు జరుగు భవానీ దీక్ష విరమణల సందర్బంగా దేవస్థానం వారు దసరా లాగే పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం నుండి కావలసిన సహకారములు అందిస్తున్నాం. దీక్షా విరమణ సందర్బంగా భక్తుల సౌకర్యార్థం ముందస్తు బుకింగ్స్, దీక్షా సమాచారం, కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్స్, మెడికల్, సమయం వివరాలు తదితర సమాచారంతో కూడిన మొబైల్ ఆప్ ను ఆవిష్కరించి లాంచ్ చేశారు. భక్తులందరూ ప్లే స్టోర్ నుండి భవాని దీక్ష 2024 అను ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని వినియోగించుకొనవలసిందిగా తెలిపారు.
- Advertisement -