ఆర్టీసీ యే ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసేల కేంద్రం చట్ట సవరణ చేయాలి

- Advertisement -

ఆర్టీసీ యే ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసేల కేంద్రం చట్ట సవరణ చేయాలి

RTC Ye Electrical Buses Purchase Center Act should be amended

మంథని

ఆర్టీసీ స్వయంగా ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని, ఆర్టీసీలకు ఆ మేరకు నిధులు సమకూర్చి బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు
తెలంగాణ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ( సిఐటియు), స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్( ఐఎన్టియుసి) పిలుపు మేరకు రెండవ రోజైన శనివారం సైతం మంథని బస్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు జేబులకు పలు డిమాండ్లతో కూడిన బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మంథని డివిజన్ అధ్యక్షుడు బూడిద గణేష్  మాట్లాడుతూ ఆర్టీసీలో పెద్ద ఎత్తున ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల అద్దె చెల్లింపు ఆర్టీసీకి భారంగా మారి, ఆర్టీసీ తీవ్రమైన నష్టాల్లోకి కూరుకుపోయే అవకాశం ఉందని అన్నారు . ఫలితంగా ఈ భారాలను ప్రజలపై మోపే ప్రమాదముంది. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ నుంచి బస్సులు అద్దెకు తీసుకోవడం వల్ల ఆర్టీసీ లో పనిచేస్తున్న డ్రైవర్లు, మెకానికులు, కండక్టర్ల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ప్రైవేట్ కంపెనీ నుంచి ఎలక్ట్రికల్ బస్సులను అద్దెకు తీసుకోవడం మానేసి ఆర్టీసీ యే ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసేల కేంద్రం చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కూడా ఈ విషయంపై ఆలోచన చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంథని ఎస్ బ్ల్యూ ఎఫ్ డిపో కార్యదర్శి రాపెల్లి రాజయ్య, ఉద్యోగులు శ్రీనివాస్, సురెందర్, రమేశ్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular