- Advertisement -
కేసీఆర్ సభ ఏర్పాట్లను పరిశీలించిన సబిత
రంగారెడ్డి
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా రేపు సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానం లో నిర్వహించే ప్రజాఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు .ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి .మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ,స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ,శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తదితర నాయకులు సభా ప్రాంగణం కలియతిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు .
- Advertisement -