సలార్ మూవీ విడుదలకు ముందే బాక్సాఫీస్ వేటను ప్రారంభించింది

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదలకు ముందే బాక్సాఫీస్ వేటను ప్రారంభించింది

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది.

దేశంలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లో విశేషంగా ప్రేక్షకులను థియేటర్‌కు పరుగులు పెట్టేలా చేస్తున్నది.

హైదరాబాద్‌లో ప్రస్తుతానికి మొత్తం 153 షోలు ప్రదర్శిస్తున్నారు.

ఈ షోలోకు ఇప్పటికే 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి.

కేవలం రెండు గంటల్లోనే ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక బెంగళూరులో సలార్ మూవీ ప్రభంజనం కొనసాగుతున్నది.

ఈ సినిమాకు సంబంధించి దాదాపు 635 షోలు ప్రదర్శిస్తుండగా..

ప్రస్తుతానికి 50 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

దాదాపు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక చెన్నైలో ఈ సినిమాకు సంబంధించి 150 షోలు ప్రదర్శిస్తుండగా, 24 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

దాంతో మొత్తం 20 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది.

ఇండియాలో మల్టీప్లెక్స్‌లో సలార్ అడ్వాన్స్ బుకింగ్ హవా కొనసాగుతున్నది.

నేషనల్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 250000 టికెట్లు అమ్ముడుపోయాయి.

పీవీఆర్ ఐనాక్స్ స్క్రీన్లలో 150000 టికెట్లు, సినీ పోలీస్ స్క్రీన్లలో 100000 టికెట్లు అమ్ముడుపోయాయి.

సలార్ మూవీ ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను, ఆక్యుపెన్సీని నమోదు చేస్తున్నది.

యూకేలో ఈ సినిమా 200కుపైగా లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు.

అలాగే మొత్తం 306 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇప్పటికే ఈ చిత్రం 24 వేల పౌండ్లు సాధించింది.

తెలుగులో 22 వేల పౌండ్లు, హిందీ వెర్షన్ 1500 పౌండ్లు, ఇతర వెర్షన్లకు 500 పౌండ్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు చేరువైంది.

గల్ఫ్‌ కంట్రీస్‌లో 200k, యూకే 100K డాలర్లు వసూలు చేసింది.

ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల షేర్ వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఉత్తరాదిలో డంకీ సినిమాను మించి సలార్ అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular