‘సల్మాన్.. నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం’
ఆయనకు మరోసారి తీవ్ర బెదిరింపులు
ముంబై ఏప్రిల్ 14
‘Salman.. we will kill you at home or we will bomb your car’
He receives serious threats once again
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా ఆయనకు మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. కొందరు దుండగులు ఆయనను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ‘సల్మాన్.. నిన్ను ఇంట్లోనే చంపుతాం లేదా నీ కారుని బాంబు పెట్టి పేల్చేస్తాం’ అని వాట్సాప్ మేసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.కాగా, గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన ఇంటిపై కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటన బాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ స్నేహితుడు, రాజకీయ నాయకుడు సిద్ధిఖీని దుండగలు కాల్చి చంపారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. కాల్పులకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.