- Advertisement -
సంకష్టహర చతుర్థి పూజలందుకున్న మహాగణపతి
Sankashtahara Chaturthi is worshiped by Mahaganapati
-అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
మంథని
సంకష్టహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మహాగణపతి దేవాలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట వీధిలో గల శ్రీ మహాగణపతి దేవాలయం ఎంతో విశిష్టత సంతరించుకుంది. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత సంకటహర చతుర్థి వస్తుంది. సంకష్ట చతుర్థి నాడు వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో కుజ దోష సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా చేసే పనులలో సంకటాలు తొలగి విజయాలు చేకూరుతాయని శాస్త్రవచనం. ఈరోజు సంకష్టి ఉపవాసాలు ఉండేవారు మహా గణపతికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతినిత్యం ఎందరో భక్తులు ఆలయంలో గణపతిని దర్శించుకొని వెళుతుంటారు. ప్రతి మంగళవారం భక్తులు విగ్నేశ్వరుని పూజిస్తుంటారు. ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున మంథని పట్టణ ప్రజలే కాకుండాచుట్టుపక్కల గ్రామాల నుండి సైతం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సంకటహర చతుర్థి దీక్ష పట్టిన భక్తులు రాత్రి చంద్రోదయం అనంతరం మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పల్లి రాము ఆలయానికి వచ్చిన భక్తులకు సంకల్పాలు, అర్చనలు, అభిషేకాలు చేయించారు. ఆలయం లోని స్వామి వారిని అలంకరిస్తూ భక్తుల సౌకర్యార్థం అర్చకులు పల్లి సంజీవ్, పల్లి రాము సోదరులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మంథని మండలం తోటగోపయ్య పల్లి గ్రామానికి చెందిన ఎక్కేటి జానకి-రవీందర్ రెడ్డి దంపతులు దేవాలయాన్ని పూలతో, ఆదియోగి విగ్రహంతో ప్రత్యేకంగా అలంకరించారు. దేవాలయానికి వచ్చిన వారు తప్పనిసరిగా ఆదియోగి విగ్రహం ముందు ఫోటోలు దిగారు.
- Advertisement -