- Advertisement -
దుమ్ములపేటలో సంక్రాంతి వేడుకలు
Sankranti celebrations in Dummulapetకాకినాడ
గత వైకాపా ప్రభుత్వం మత్స్యకారులను అనేక ఇబ్బందులను గురి చేయడమే కాకుండా వారి సంక్షేమాన్ని విస్మరించిందని కాకినాడ సిటి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ కార్పోరేషన్లోని 10వ డివిజన్ దుమ్ములపేటలో స్థానిక నాయకులు మూగ రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్యఅతిధిగా పాల్గొని మహిళలు వేసిన రంగురంగుల రంగోళిలను పరిశీలించారు. అలాగే భోగి మంటలను వేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మూగ రాజు అధ్యక్షతన జరిగిన సభలో సిటి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. మత్స్యకార సంక్షేమాన్ని, వేట నిషేధ సమయంలో ఇవ్వలసిన పరిహారం కూడా అరకొరగా ఇవ్వడం జరిగిందన్నారు. కాని కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఏదైతో మాట ఇచ్చిందో. ఆ మాట ప్రకారం మత్స్యకార సంక్షేమం కోసం పాటుపడుతోందని, మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ తుమ్మల సునీత, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
- Advertisement -




