Thursday, December 12, 2024

సంత సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవము…

- Advertisement -

సంత సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవము…
◆నేడే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి.
కామారెడ్డి బ్యూరో పిబ్రవరి15 వాయిస్ టుడే;
సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవము.ఆయన జయంతిని ప్రతి తండాలో పండగల జరుపుకుంటారు…గిరిజనులకు దశ-దిశను చూపి, హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా చరిత్ర కారులు గిరిజన పూర్వికులు చెబుతారు.

సంత్ సేవాలాల్ జీవిత విశేషాలు…

అతను 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్‌ జిల్లా రాంజీనాయక్‌ తండాలో జన్మించాడు. ఈయనకు సేవాలాల్‌ అని నామకరణం చేశారు. సేవాలాల్‌ పెరిగిన తరువాత కొంతకాలంలో మేరమ్మగా పిలువబడే జగదాంబ ప్రత్యక్షమైన సేవాలాల్‌ని నాకు అప్పజెప్పమని భీమనాయక్‌ను అడుగుతుంది. అమ్మ వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్‌ అందుకు ఒప్పుకోడు. తల్లిదండ్రులు సేవాలాల్‌ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాఖాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలచు కోలేదని అంటాడు. అప్పుడు మేరమ్మ సేవాలాల్‌కు ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. అయిన సేవాలాల్‌ చలించడు. చివరకు తండాలను, కష్టాల పాలు చేస్తుంది. ఇదంతా సేవాలాల్‌ కారణంగా జరుగుతుందని తండావాసులు, తండా రాజ్యం నుంచి ఆయనను బహిష్కరిస్తారు. కలను బలి ఇవ్వకుండ అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు. వారి కోరిక మేరకు సాతీ భావానీలకు(సప్త దేవతలు) మేకపోతులను బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు. ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు. కాని సేవాలాల్‌ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించడు. ఎందుకంటే ఆయన అమాయక ముగ జీవుల్ని బలిచేస్తుంటే చూడలేక, ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్‌ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర పడేస్తారు. నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు. అమ్మవారు సేవాలాల్‌ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. ఇన్నాళ్లు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్‌ నెగ్గాడు. నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి సేవాలాల్‌ జగదాంబమాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు.

బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు…

ఆరు నెలల ప్రాయంలోనే సేవాలాల్‌ కొండపైన చాముండేశ్వరీ దేవతా మూర్తులతో ఆటలు ఆడుకునేవాడు. సేవాలాల్‌- చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా భీమా నాయక్‌ గమనించి విచారిస్తే ప్రతిదినం అలాగే అడుకుంటామన్నాడు. పెరిగి పెద్దవాడైన సేవాలాల్‌ ఆవులు కాసేవాడు. తల్లిసద్ది కట్టిస్టే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులోనికి పోయేవాడు. ఒక బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు. ఈ విచిత్ర ప్రవర్తన తల్లితండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది.

సేవాలాల్ మహారాజ్ బోధనలు…

ఈ సమస్త జీవకోటికి మాతృరూపం (తల్లిగా) వెలిసిన అమ్మభవాని గురించి అమ్మను పూజించాలని, కాని ఫలితం ఆశించవద్దని బంజారాలకు బోధించారు. సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌, హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుసుడయ్యారు.

బంజారా జాతిని సన్మర్గంలో నడిపించిన సేవాలాల్‌ మహారాజ్‌…

సేవాలాల్‌ మహరాజ్‌ ఆనాడు బంజార జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లీం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యింది. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మర్గంలో నడిపించెందుకు సేవాలాల్‌ మహారాజ్‌ అవతరించారని చరిత్ర కారుల ద్వారా తెలుస్తుంది…

సంత్ సేవలాల్ మహరాజ్ మహిమలు…

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ మహిమలు అద్భుతమైనవి. వీటి మీద అనేక కథనాలు కలవు. వాటిలో పురుషున్ని స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో వేల మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బ్రతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీయం చేయడం. ఉదృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను, ఆవులను దాటించడం. సేవాలాల్‌కు అపకీర్తి తీసుకురావాలని జాదూగర్‌ వడితియా ఒక పురుసుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు. సేవాలాల్‌ తథాస్తు అంటూ దీవిస్తాడు. నిజంగానే ఆ పురుషుడు స్త్రీగా మారిపోతాడు. అలాగే సేవాలాల్‌ దర్బారులోనికి తలవంచి ప్రవేశించడానికి అతడి ప్రవేశ మార్గంలో చిన్న తలుపును ఏర్పాటు చేయగా సేవాలాల్‌ తన ఆకారాన్ని కుదించుకుని తలవంచకుండానే ఆ దర్వాజాలో నుండి ప్రవేశిస్తాడు. అలాగే సేవాలాల్‌ను బావిలో దిగి సన్నని నూలు పోగు ఆధారంతో పైకి వచ్చి తన భక్తిని నిరూపించారు.

“పెరిఫర్” బంజరాల కోసం ఇతర ఉద్యమం…

సేవాలాల్‌ మహరాజ్‌ బంజారా ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్‌’ ఒకటి ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం మొదలైనవి ఎన్నో ఉద్యమాలు చేసి భారతదేశం లోని దాదాపు 11 కోట్ల బంజారా ప్రజలకు ఆరాధ్యదైవం గా నిలిచారు…

భానోత్ నరేశ్ నాయక్…
LL.B,MSW
●ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ (ఎన్జీఓ)-ఫౌండర్ & చైర్మన్
●లంబాడీలా ఐక్య వేదిక -కామారెడ్డి జిల్లా ఇంచార్జ్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్