హైదరాబాద్, వాయిస్ టుడే: సిరిసిల్ల అనగానే.. నేతన్నలు గుర్తుకొస్తారు. అగ్గి పెట్టాలో పట్టే చీరను తయారు చేసారు ఇక్కడి నేతన్నలు. అర్ధక ఇబ్బందులు ఎదురయినా ఈ వృత్తి నుంచి బయటకు రాలేదు.. ఇప్పుడు ఆర్థిక ప్రగతి తో పాటు అద్భుతాలు చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్లా విజయ్ మరోసారి తన ప్రతిభకు పదును పెట్టి 20 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండిని పూర్తి గా ఉపయోగించి పట్టు దారాలతో చీరను తయారు చేశారు. ఈ చీర వెడల్పు 48 ఇంచులు, పొడవు ఐదున్నర మీటర్లు, బరువు 500 గ్రాముల ఈ చీర ఖరీదు సుమారుగా 1,80,000 రూపాయలు ఖర్చు అయింది. దీనిని తయారు చేయడానికి నెల రోజుల సమయం పట్టింది.ఇంకా త్వరలో మరో చీర తయారు చేయనున్నారు దాదాపు 25 లక్షల రూపాయలు వెచ్చించి త్వరలో ఒక చీరను తయారు చేయనున్నారు. ఈ చీరలో దాదాపుగా అర కేజీ వెండి, పావు కేజీ కేజీ గోల్డ్ ద్వారా ఆ చీరను నేయనున్నారు.
కొంత మంది వ్యాపారాస్తులు.. వీటిని కొనుగోలు చేయడానికి ముందుకోస్తున్నారు. గతం లో అగ్గి పెట్టేలో ఇమిడే చీర, శాల్వా, డబ్బనం, సూది రంధ్రం లో దూరే చీర, తిరుమవేంకటేశ్వర స్వామి వారికి రెండు గ్రాముల బంగారంతో పట్టు వస్త్రం, విజయవాడ కనుక దుర్గమ్మ అమ్మ వారికి పట్టు చీర, 220 రకాల రంగుల చీర, తామర, అరటి నారాతో తయారు చేసారు చీర 20 గ్రాములతో వెండి చిర, 27 సుగంధ ద్రవ్యాల సువాసన వచ్చే విధంగా చిరను నేశాననీ అంటున్నారు విజయ్. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని అద్భుతాలు చేస్తానని చెబుతున్నారు.. యువత చేనేత ను ఆదరించాలని కోరుతున్నారు.కాగా, గతంలో చాలా మంది యువకులు.. వర్క్ వృత్తి నుంచి బయటకు వచ్చారు. గతం లో ఇక్కడ ఉపాధి లేకపోవడం తో.. ఇతర రాష్ట్ర లకు వలస వెళ్లేవారు.. ఇక్కడ బతుకమ్మ చీరలు తో పాటు. ప్రభుత్వ స్కూల్ డ్రెస్ లకు ఆర్డర్ లు వస్తున్నాయి.. ఇక్కడ ఉపాది పెరగడం తో సిరిసిల్ల కు వస్తున్నారు. విజయ్.. నేటి యువత కు ఆదర్శంగా నిలిస్తున్నారు.. ఆయన చేనేత లో నైపుణ్యం సాధిస్తున్నారు.. వేరే రంగం లో అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగం లో కొత్త ఆలోచన ల తో ముందుకు వెళ్తున్నారు.. ఇతని నైపుణ్యాన్ని మినిస్టర్ కేటీఆర్ ప్రశంసిoచారు.. అయితే.. ప్రభుత్వం… మరిన్ని నిధులు మంజూరు చేస్తే. మరిన్ని అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు…