- Advertisement -
పొన్నూరు పోలీసుల తీరును ఖండించిన సత్తెనపల్లి న్యాయవాదులు
Sattenapalli lawyers condemned the behavior of Ponnur police
సత్తెనపల్లి,
సత్తెనపల్లి పట్టణంలోని తాలూక కోర్టు ప్రాంగణంలో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద గుంటూరు జిల్లా బార్ పెడరేషన్ పిలుపులో భాగంగా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్ ఆద్వర్యంలో సోమవారం నాలుగు కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించి న్యాయదేవత విగ్రహం వద్దకు చేరుకొని ముక్తకంఠంతో నినాదాలు చేస్తూ తీవ్ర నిరశనను వ్యక్తం చేశారు. పొన్నూరు బార్ అసోసియేషన్ లో సభ్యులు న్యాయవాది భేతాళ ప్రకాశరావు ను పొన్నూరు పోలీసులు అతనిని నిర్బంధించి వాతలు తేలే విధంగా కొట్టిన పోలీసుల పై చర్యలు తీసుకోకాకుండా బాధిత న్యాయవాది పైనే కేసు నమోదు చేయటాన్ని తీవ్రంగా బార్ అసోసియేషన్ తరుపున తీవ్రంగా ఖండించారు. పోలీసు ఉన్నత అధికారులు స్పందించాలి అని వెంటనే సదరు పోలీసుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్,న్యాయవాదులు చిట్టా విజయ భాస్కర రెడ్డి,బి. ఎల్.చిన్నయ్య ,బత్తిన శ్రీనివాసబాబు,దివ్వెల శ్రీనివాసరావు, కాకర్ల హరిబాబు, చావా బాబురావు,బి.ఎల్. కోటేశ్వరరావు, జొన్నలగడ్డ విజయ్ కుమార్, రాజవరపు నరసింహరావు,షేక్ జానీ ఖాజావలి, వడియాల పాపారావు,కోట సాంబశివరావు, యర్రమాసు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -