కుప్పంలో నకిలీ డికేటీ పట్టాల స్కాం

- Advertisement -

కుప్పంలో నకిలీ డికేటీ పట్టాల స్కాం

Scam of fake DKT in Kuppam

పోలీసుల అదుపులో నిందితుడు
చిత్తూరు
సిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నకిలీ డికేటి పట్టాలు స్కాం బయటపడింది. భారీ ఎత్తున నకిలీ డికేటి పట్టాలు జారీ చేసిన నిందితుడిని అధికారులు గుర్తించారు.  గత పదేళ్లుగా భారీ ఎత్తున ఇష్టారాజ్యంగా నకిలీ డికేటి పట్టాలు  కంప్యూటర్ ఆపరేటర్ జారీ చేసాడు. గుడిపల్లి తహశీల్దార్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన జగదీష్ గా గుర్తించారు. గుడిపల్లి తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదుతో వచ్చిన నకిలీ డి.కేటి పట్టాలు స్కాం వెలుగులోకి వచ్చింది.  కుప్పంలో నకిలీ డికేటి పట్టాలను సృష్టించిన నిందితుడు జగదీష్ ను పోలీసులు  అరెస్టు చేసారు. గుడిపల్లి మండలంలో రైతులకు నకిలీ డీ – పట్టాలను జారీ చేస్తూ భారీగా సంపాదించాడు. 8 జీరాక్స్ ఖాళీ డి- పట్టాలు, 2 నకిలి పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పట్టాలను రైతులు నిజమైన పట్టాలుగా నమ్మి, కోర్టు కేసుల్లో కూడా దాఖలు చేసినట్లు గుర్తించారు. ఎవరైనా నకిలీ డి -పట్టాలను రైతులకు అందిస్తే చర్యలు తీసుకుంటామని డిఎస్పీ పార్థసారథి హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular