సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
Secretariat Secretaries should be accessible to the public.
సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు
కమిషనర్ ఎన్.మౌర్య
సచివాలయ కార్యదర్శులు, నగరపాలక సంస్థ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఖచ్చితంగా సమయపాలన పాటించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని సచివాలయాల కార్యదర్శుల హాజరు నమోదును పరిశీలించి, అందుబాటులో లేని వారిపై చర్యలకు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది, కార్యాలయ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రతి సచివాలయం వద్ద కార్యదర్శులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర,, మేనేజర్ హాసిమ్, ఏసిపి బాలాజి, డి.ఈలు, సూపరింటెండెంట్లు, తదితరులు ఉన్నారు..