Wednesday, March 4, 2026

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

- Advertisement -

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌

Secunderabad railway station is like an airport

 

2026 నాటికి పునరాభివృద్ధి పనులు పూర్తి* *కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌* హైదరాబాద్‌, సికింద్రాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు తరహాలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆధునిక రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ర వ్‌నీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. సుమారు రూ.700 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులను 2026నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకు 27శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. శనివారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌, తదితర రైల్వే అధికారులతో కలిసి రవ్‌నీత్‌ సింగ్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను సందర్శించి పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.5,000 కోట్లకుపైగా అంచనా వ్యయంతో 119 రైల్వేస్టేషన్లను అభివృద్థి చేస్తున్నట్టు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, కాచిగూడ రైల్వేేస్టషన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా..రైల్‌ నిలయంలో శనివారం కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్