న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం బయట పడింది. గుర్తు తెలియిన వ్యక్తి గ్యాలరీలో నుంచి సభలోకి దూసుకొచ్చాడు. టియర్ గ్యాస్ వదిలాడు. ఈ ఘటన అలజడి సృష్టించింది. భయంతో ఎంపీలు పరుగులు పెట్టారు. స్పీకర్ వెంటనే సభను వాయిదా వేశారు. జీరో అవర్‌లో ఈ ఘటన జరిగింది.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఇద్దరి ఆగంతుకులను పట్టున్నారు. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగింది. ఈ ఘటనకు ఇవాళ్టికి 22 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు మరోసారి లోక్‌సభలోకి ఇలా ఆగంతకులు
దూసుకురావడం కలకలం రేపింది. లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు దూసుకురావడం అలజడి సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భద్రతా వైఫల్యంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సూచించినట్టు తెలిపారు. ఈ ఘటన తరవాత సభ తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించాం. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. తగిన చర్యలు
తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు సూచించాం. ఆ ఆగంతకులు సభలో వదిలిన గ్యాస్ ప్రమాదకరమైంది కాదని ప్రాథమిక విచారణలో తేలింది. దీని గురించి భయపడాల్సిన పని లేదు”ఓ నిందితుడి పేరు
సాగర్‌గా గుర్తించింది భద్రతా సిబ్బంది. దీనిపై పలువురు ఎంపీలు స్పందించారు.”పబ్లిక్ గ్యాలరీ నుంచి ఓ వ్యక్తి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూసుకొచ్చాడు. మరో వ్యక్తి లోక్‌సభలోని పబ్లిక్ గ్యాలరీ నుంచి టియర్ గ్యాస్ ప్రయోగించాడు. ఈ గ్యాస్ కారణంగా మాకు కళ్ల మంటలొచ్చాయయని అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ అన్నారు.

మరో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం కూడా ఈ ఘటనపై స్పందించారు. ఇద్దరు గుర్తు తెలియని
యువకులు ఉన్నట్టుండి సభలోకి దూసుకొచ్చారని చెప్పారు.
“20 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి సభలోకి దూసుకొచ్చారు. విజిటర్స్ గ్యాలరీలో నుంచి వచ్చారు. వాళ్ల చేతుల్లో ఏవో
ఉన్నాయి. వాటి నుంచి పసుపు రంగు పొగ వచ్చింది. ఆ ఇద్దరిలో ఒకరు స్పీకర్ కుర్చీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఏదో నినాదాలు చేశాడు. బహుశా ఆ పొగ విషపూరితం కావచ్చు. ఈ భద్రతా
వైఫల్యాన్ని చాలా తీవ్రంగా పరిగణించాలి”
– కార్తీ చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ
ఇలా జరిగింది..
ఈ ఘటన జరిగినప్పుడు బీజేపీ ఎంపీ ఖర్గేన్ ముర్ము మాట్లాడుతున్నారు. లోక్‌సభలో జీరో ఆవర్ జరుగుతున్న
సమయంలో హఠాత్తుగా ఇద్దరు ఆగంతకులు సందర్శకులు కూర్చొనే గ్యాలరీ నుంచి దూకి సభలోకి ప్రవేశించారు. గ్యాలరీ నుండి క్రిందికి దూకి గ్యాస్ క్యానిస్టర్‌లను విసిరారు. సభ్యులు కూర్చునే టేబుల్స్‌పై
నుంచి దూకుతూ సభాపతి స్థానం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఖంగుతిన్న ఎంపీలు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నాలుగు వైపుల నుంచి వారిని చుట్టుముట్టి బంధించారు.ఈ
క్రమంలో ఆ ఆగంతకులు తమ షూస్ బయటకు తీశారని, దాన్నుంచి ఒక్కసారిగా పసుపు రంగు పొగ వచ్చిందని ఎంపీలు తెలిపారు. ఆ పొగ సభంతా నిండిపోయిందని సభ్యులు తెలిపారు. ఈ కలకలం
మధ్య సభను సభాపతి వాయిదా వేశారు.లోక్‌సభలోకి వచ్చిన ఆగంతకులను భద్రతా సిబ్బంది బంధించారు. ఇద్దరి వయస్సు 35 సంవత్సరాల లోపు ఉంటుందని ఎంపీలు తెలిపారు. ఆ ఇద్దరు అర్థం కానీ
రీతిలో నినాదాలు చేశారని, గందరగోళం మధ్య అవి వినిపించలేదని వెల్లడించారు.
వారిలో ఒకరి పేరు సాగర్ అని కొంత మంది ఎంపీలు తెలిపారు. అతను మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా గెస్ట్‌గా పాస్
తీసుకున్నారని అన్నారు.2001 పార్లమెంటు దాడి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం లోక్‌సభ లోపల ఒక పెద్ద భద్రతా ఉల్లంఘనలో, ఇద్దరు వ్యక్తులు ప్రేక్షకుల గ్యాలరీ నుండి క్రిందికి దూకి గ్యాస్
క్యానిస్టర్‌లను విసిరారు. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారని ఎంపీలు తెలిపారు.మొదట ఓ వ్యక్తి బ్యారియెర్‌పై నుంచి దూకాడు. ఆ తరవాత సభలోకి దూసుకొచ్చాడు. ఆ
వ్యక్తి వెనకాలే మరో వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే ఇద్దరూ తమ షూలో నుంచి ఏదో బయటకు తీశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. అప్రమత్తమైన ఎంపీలు పరుగులు పెట్టారు. పార్లమెంట్ భద్రతా సిబ్బంది
ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పార్లమెంట్ ఆవరణలో ఇద్దరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓ ఎంపీ కార్యాలయం నుంచి ఇష్యూ అయిన విజిటర్ పాస్‌లతో ఇద్దరూ విజిటింగ్ గ్యాలరీకి వచ్చినట్టు
ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది.
ప్రమాదకరమైన దేమి కాదు స్పీకర్
లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు దూసుకురావడం అలజడి సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి
ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భద్రతా వైఫల్యంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు
సూచించినట్టు తెలిపారు. ఈ ఘటన తరవాత సభ తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. “జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించాం.
ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు సూచించాం. ఆ ఆగంతకులు సభలో వదిలిన గ్యాస్ ప్రమాదకరమైంది కాదని ప్రాథమిక విచారణలో తేలింది. దీని గురించి
భయపడాల్సిన పని లేదు”