నరసరావుపేటలో సమస్యలు పరిష్కారం కోరుతూ
Seeking solution to problems in Narasaraopet
జిల్లా కలెక్టర్ కు సిపిఐ బృందం వినతి పత్రం
నరసరావుపేట, ఉ
నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రం అయిన నరసరావుపేట లో ఏ మాత్రం రోడ్లు వసతులు లేవని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం కలెక్టర్ పి అరుణ్ బాబుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో రోడ్డు ప్రక్కల ఆక్రమణలు గురి అయినటువంటి రోడ్లను వెడల్పు చేయాలని సిపిఐ బృందం మెమోరాన్ని సమర్పించడం జరిగింది. బస్టాండ్ నుండి ప్రకాష్ నగర్ లోని రైల్వే స్టేషన్ రోడ్డు వరకు పాదాచారలు నడవటానికి కూడా వీలు లేకుండా పోయిందని అన్నారు. అదేవిధంగా వినుకొండ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు కలెక్టరేట్ రోడ్డు, పల్నాడు బస్టాండ్ రోడ్డు మరియు టౌన్ లో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. తక్షణమే రోడ్లను వెడల్పు చేయవలసిందిగా సిపిఐ ప్రతినిధి బృందం కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సిపిఐ ఏరియా కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణ రాజు, సిపిఐ పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, సిపిఐ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, ఎస్.కె చిన్న జాను సైదా తదితరులు పాల్గొన్నారు.