జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
సాధారాణ ఎన్నికలలో భాగంగా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు గాను, జిల్లా ఎస్పీ ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ టీమ్స్ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుంది. ఈ దాడులలో భాగంగా.. బీఆర్ ఎస్ పార్టీ కి చెందిన 1) శ్రీనివాస్ రెడ్డి తండ్రి యాది రెడ్డి, గ్రామం: ముత్తంగి, 2) సి. హెచ్ శ్రీనివాస్ తండ్రి ఆగమయ్య. గ్రామం: ముత్తంగి, 3) నల్లవల్లి కిరణ్ రెడ్డి తండ్రి జానా రెడ్డి, గ్రామం: ముత్తంగి, 4) బి. భరత్ రెడ్డి తండ్రి కృష్ణ రెడ్డి, గ్రామం: ముత్తంగి, పై నలుగురు వ్యక్తులు ముత్తంగి గ్రామంలో గల పి.యస్.ఆర్. గార్డెన్ నందు ఓటర్లను మబ్య పెడుతూ అక్రమంగా ఓటుకు డబ్బు పంపిణీ చేస్తుండగా స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రూ: 49,490/-, 4-సెల్ ఫోన్, 2- ఓటరు స్లీప్, 1- కరపత్రం, 7- ఓటరు కార్డులు స్వాధీనపరుచుకొని, నిందితులతో సహ స్వాధీనపరుచుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం పటాన్ చెర్వు పోలీసు స్టేషన్ కు తరలించారు
ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ అక్రమంగా పంపిణీ చేస్తున్న డబ్బు రూ.49,490/- లు స్వాధీనం ..
- Advertisement -
- Advertisement -



