స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష
Self political existence is Sri Rama’s protection for Telangana
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
హైదరాబాద్ జూలై 11
చంద్రబాబు, నితీశ్ కుమార్ కు చెందిన పార్టీలు మద్దతు ఇవ్వకపోతే మోడీ ప్రభుత్వం గట్టెక్కేదే కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. కాగా చంద్రబాబు నాయుడు తన డిమాండ్లను మోడీ ముందుంచి నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి రూ. 1 ట్రిలియన్ కోరారని సమాచారం. అంటే లక్ష కోట్ల రూపాయలు. ఈ వార్త బ్లూమ్ బర్గ్ వెబ్ సైట్ ప్రకటించింది. దానికి సంబంధించిన కథనాన్ని మనేకా దోశి అనే జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.జర్నలిస్ట్ మనేకా ట్వీట్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే కేంద్రంలో ఎలా చక్రం తిప్పొచ్చో దీని ద్వారా తెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు.లోక్ సభ ఎన్నికలు అయిపోగానే సింగరేణిని బిజెపి ప్రభుత్వం వేలం వేసిందన్నారు కెటిఆర్. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ భూములను తనఖా పెట్టేందుకు సిద్ధమైందన్నారు.