దొర నీ బాంచన్ అనే రోజుల్లోస్తాయి
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్
కరీంనగర్ నవంబర్ 20: తెలంగాణలో దొరల రాజ్యం పోతేనే సామాజిక న్యాయం జరుగుతుందని, కేటీఆర్ ను గెలిపిస్తే అతన్ని కలిసే అవకాశం లేదని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో గంగుల కమలాకర్ ను గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న మండలానికోక దొర, డివిజన్ ఒక దొర, గ్రామానికో దొర చెప్పుతేనే పనులు అవుతాయని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రజాసామిక హక్కు ఓటును సద్వినియోగం చేసుకుంటే కాంగ్రెస్ పాలన వస్తుందన్నారు.కరీంనగర్ కాంగ్రెస్ గెలిస్తేనే బడుగు బలహీన వర్గాల, పేదల బతుకులు బాగుపడతాయని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గం వర్గం పరిధిలోని నగునూర్,జూబ్లీ నగర్,ఎలభోతారం, ఎన్ఎన్ గార్డెన్, పకీర్పేట్, చామనపల్లి, దుబ్బపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆయా గ్రామాలలో గల్లీ గల్లీలో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్, చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి వ్యక్తి తో మాట్లాడాడు. అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని అన్నారు.కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ పథకాలు అమలు అవుతాయని పేర్కొంటూ గడపగడపకు ప్రచారం చేశారు. చేతి గుర్తు కు ఓటు వేసి అధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయంటే, ఆశించినదొకటి అమలైంది మరొకటి అని అన్నారు. బతుకులు మరింత దుర్భరం య్యాయని తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య పేరుకుపోయిందని అన్నారు. రాష్ట్రం సాధించాక కెసిఆర్ కుటుంబానికి నాలుగు ఉద్యోగాలు సంపాదించుకున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ అగ్రవర్ణ పేదల్లారా అవినీతికి తావు లేకుండా మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో తమ ఓటును పలు రాజకీయ పార్టీలు పలోభాలకు గురి చేస్తాయని , మన ఓటు అమ్ముకుంటే తన సొంత బిడ్డను అమ్ముకున్నట్టేనని అన్నారు. కాంగ్రెస్ ప్రచారంలో గ్రామ గ్రామానికి వేలాది మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొన్నారు.