- Advertisement -
భవిత దివ్యాంగుల పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు
Semi-Christmas celebrations at Bhavita Divyang Schoolముఖ్యఅతిథిగా డాక్టర్ పోరెడ్డి. వెంగళరెడ్డి
పిడుగురాళ్ల,
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో, విజయసాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ పోరెడ్డి. వెంగళరెడ్డి సహాయ సహకారాలతో సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి,సుమారు వంద మంది విద్యార్థినీ విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారందరికీ డాక్టర్ పోరెడ్డి వెంగళరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల రీసోర్స్ పర్సన్స్ మారం.అజిత్ కుమార్, హరి కుమార్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, తల్లిదండ్రులు, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -




