చీర కట్టుకుని  ఫొటోలు పంపించు..

- Advertisement -

మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు!

హైదరాబాద్: తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్‌ సింగ్‌ తనను వేధిస్తున్నారంటూ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు..

send-photos-wearing-a-saree
send-photos-wearing-a-saree

ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

”కిషన్‌సింగ్‌.. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు. చీర కట్టుకుని ఉన్న ఫొటోలు పంపాలంటూ వేధిస్తున్నారు. ఆ టార్చర్‌ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాను” అని మహిళా ఉద్యోగి ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో కిషన్‌సింగ్‌ పరిచయమైనట్లు ఆ మహిళ తెలిపారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular