Sunday, September 8, 2024

తెలంగాణ నుంచి ఆంధ్రకు సీనియర్ ఐపిఎస్ అధికారి!

- Advertisement -

ఏపీకి చెందిన సుబ్బరాయుడుకు విభజన సమయంలో తెలంగాణ క్యాడర్ ఖరారయింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సహా పలు కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధన మేరకు ఎపికి ఆయన పంపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి సుబ్బరాయుడు ను మూడేళ్లపాటు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ లో ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ వెంటనే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సుబ్బరాయుడుకు చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్హాతో పాటు రాజమౌళి, కార్తికేయమిశ్రా వంటి ఐఏఎస్ అధికారుల్ని ఏపీకి రప్పించారు. చురుగ్గా పని చేసే మరికొంత మంది అధికారుల్ని కూడా చంద్రబాబు డిప్యూటేషన్ పై ఏపీకి రప్పించే అవకాశాలు ఉన్నాయి


.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్