మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లా:ఫిబ్రవరి 14
మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది.
దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేట నుంచి మెదక్ కు వస్తున్న పెండ్లి బృందం బస్సును మెదక్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంజరిగినట్టు తెలిసింది..
మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్ళ డంతో క్షతగాత్రులను ఫోన్ లో పరామర్శించారు. వెంటనే సిద్దిపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూప రిండెంట్ తో ఫోన్ లో మాట్లాడారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలం దించాలని పేర్కొన్నారు. అవసరమైతే హైద్రాబాద్ లోని ఆసుపత్రికి తరలించా లని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఫోన్ లో మాట్లాడి హామీ ఇచ్చారు.