Saturday, April 25, 2026

ఎపిలో ఆర్ఈ పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పండి

- Advertisement -

ఎపిలో ఆర్ఈ పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పండి

Set up RE equipment manufacturing unit in AP

ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ

దావోస్:
ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్  దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు.  దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ప్రగతిశీల ఆలోచనలతో శరవేగంగా

అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం 11 గిగావాట్లుగా ఉన్న రెన్యువబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యాన్ని 2030నాటకి పెంచాలన్నది మా లక్ష్యం.

ఇది మొత్తం దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో 32శాతంగా ఉంది. 2030నాటికి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 10లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని

లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024 రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తుంది. రెన్యవబుల్ ఎనర్జీ రంగంలో

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఎపిలో రెన్యువబుల్ ఎనర్జీ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుచేసి, ప్రోత్సాక ప్రయోజనాలను అందిపుచ్చుకోండి. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కు

సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్ లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్ ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించాలని మంత్రి లోకేష్ కోరారు. ఎన్విజన్ సిఇఓ లీ జంగ్

మాట్లాడుతూ…. 2023-24లో 5 గిగావాట్ల ఆర్డర్లతో భారత్ లో ఎన్విజన్ అగ్రగామి విండ్ టర్భైన్ సరఫరాదారుగా నిలచింది. భారతదేశంలో 3 గిగావాట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యంతో పూణే లోని నాసెల్లె లో, బ్లేడ్లల

కోసం త్రిచిలో రూ.500 కోట్లతో అత్యాధునిక తయారీ ప్లాంట్లను ఏర్పాటుచేశాం. దేశంలోని ఇతర ప్రాంతాల్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని భావిస్తున్నాం. ఆంధప్రదేశ్ విజ్ఞప్తిపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం

తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్