విద్యార్థులకు లైంగిక వేధింపులు.. టీచర్ సస్పెండ్
Sexual harassment of students.. Teacher suspended
ప్రకాశం
మద్దిపాడు మండలం
వెల్లంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడన్న ఫిర్యాదులతో సస్పెండ్ చేశారు.
ఈ మేరకు టీచర్ గోపనబోయిన రవికుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో కిరణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రవికుమార్‌ది కురిచేడు మండలం కాటంవారిపాలెం కాగా.. ఆయన 2017 నుంచి వెల్లంపల్లి స్కూల్‌లో పనిచేస్తున్నాడు.
ఆయన విద్యార్థుల్ని లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు రావడంతో.. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో డిప్యూటీ కలెక్టర్ మాధురి, గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హేమలతలు విచారణ జరిపి నివేదికను ఇచ్చారు. ఈ రిపోర్ట్‌ను బట్టి టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో.. రవికుమార్‌ను విధుల నుంచి తొలగిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.. అలాగే రవికుమార్‌పై మద్దిపాడు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.