Sunday, September 8, 2024

 జూలై 21న శ్రీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవం

- Advertisement -

 జూలై 21న శ్రీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవం

Shakambhari Utsav for Shri Amma on 21st July

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో లోకకల్యాణం కోసం ఆషాఢపౌర్ణమిని పురస్కరించుకొని జూలై 21వ తేదీన శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవం నిర్వహింపబడనున్నది
ఈ ఉత్సవంలో శ్రీఅమ్మవారి మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ మరియు పలు రకాల ఫలాలతో విశేషంగా అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి ఉత్సవ సంబంధి విశేషపూజలు జరిపించబడుతాయి. ఇంకా దేవాలయ ప్రాంగణం కూడా పలు రకాల ఆకుకూరలు, కూరగాయాలతో అలంకరించబడుతుంది
ఉత్సవంలో భాగంగానే శ్రీఅమ్మవారి ఉత్సవమూర్తికి, ఆలయప్రాంగణంలోని రాజరాజేశ్వరిదేవికి, గ్రామదేవత అంకాళమ్మకు ప్రత్యేకపూజలు, విశేషంగా చేయబడుతుంది. శాకాలంకరణ
ఈ ఉత్సవములో ఆయా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పలు రకాల పండ్లువినియోగించబడుతాయి
ఈ విధంగా అమ్మవారిని శాకాలతో అర్చించడం వలన అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగాపండుతాయని, కరువుకాటకాలు నివారించబడతాయని పురాణాలు చెబుతున్నాయి.
కాగా పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్ధానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువుకాటకాలతో తీవ్రక్షామం ఏర్పడింది. అప్పుడు మహర్షులందరూ ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరాశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి వైదిక కర్మలను పునరుద్ధరింపజేసింది
ఈ సందర్భంలోనే జగన్మాత తన నుండి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు ఫలాలు మొదలైన శాకాలను సృష్టించి, క్షామాన్ని నివారించింది. ఆ విధంగా అవతరించిన ఆ పరాశక్తి స్వరూపమే శాకంభరీదేవి.
ఈ కారణంగానే ఆషాఢ పౌర్ణమిరోజున అమ్మవారిని శాకాలతో అలంకరించి ఆర్పించే సంప్రదాయం ఏర్పడింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్