అన్నీ స్థానాల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ
వైఎస్ షర్మిల
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగింది. వైఎస్ షర్మిలా మాట్లాడుతూ 119 నియోజక వర్గాల్లో మా పోటీ చేస్తుంది. 119 నియోజక వర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని అన్నారు. బి ఫామ్ ల కోసం ధరకాస్తు పెట్టుకోవచ్చు. నేను పాలేరు నుంచి పోటీ చేస్తానని అన్నారు.
రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ ఉంది. బ్రదర్ అనిల్,విజయమ్మ ని కూడా పోటీ పెట్టాలని డిమాండ్ ఉంది. అవసరం అయితే అనిల్ పోటీ చేస్తారు. విజయమ్మ సైతం పోటీ చేస్తారు. కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదు అనుకున్నాం. ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి వస్తుంది అనుకున్నాం. ఓట్లు చీలిస్తే కేసీఅర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకున్నాం. అందుకే కాంగ్రెస్ తో చర్చలు జరిపాం. 4 నెలలు ఎదురు చూశాం. రాష్ట్రంలో మళ్ళీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తమని ఆమె అన్నారు.