Saturday, December 14, 2024

భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్న షర్మిళ

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 11:  తెలంగాణలో తిరిగి రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అక్టోబర్‌ 12న మధ్యాహ్నం హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని ఫ్లాన్ చేశారు షర్మిల. ఈ సమావేశంలో పోటీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా..? దూరంగా ఉండాలా? అన్నదానిపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉంది.

ప్రస్తుతం ఆమె పొలిటికల్‌ ఫ్యూచర్‌ అనే చౌరస్తాలో నిలబడి ఉన్నారు. ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. షర్మిల అనుకున్నది ఒకటి. జరుగుతోంది మరొకటి. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తే… రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఆశించారు. పలు దఫాలు చర్చలు చేశారు. అనేక ప్రతిపాదనల పైన మంతనాలు జరిగాయి. డీకే శివకుమార్ రాయబారం…నేరుగా సోనియా, రాహుల్ తో మంతనాలు కొనసాగాయి. కానీ, షర్మిల ప్రతిపాదనలకు ఆమోదం దక్కలేదు. చివరికి కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఆర్ధమై… పార్టీ విలీనానికి బ్రేక్‌ చెప్పారు. ఇప్పుడు ఒంటరి పోరుపై మల్లగుల్లాలు పడుతున్నారు.వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో వైఎస్ షర్మిల ఎంట్రీతో పాలేరు పాలిటిక్స్ హీటేక్కాయి. గతంలో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన షర్మిల. ఆ తర్వాత పాలేరు నియోజక వర్గానికి పూర్తిగా దూరమయ్యారు. ఎలాంటి కార్యక్రమాలు లేకుండా సైలెంట్ కావడంతో.. ఆమె పాలేరు నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి సడన్ ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఆవిష్కరించి.. విగ్రహం సాక్షిగా పాలేరులోనే పోటీ చేస్తా అని ప్రతిజ్ఞ చేశారు. వెనక్కి తగ్గేదీలేదంటూ.. పోటీ పై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 3,600 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన షర్మిల.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై చర్చలు జరిపారు. కానీ.. ఇప్పటి వరకూ స్పష్టత రాక పోవడంతో.. ఆమె తన పార్టీ నుంచే పాలేరులో పోటీ చేయడానికి సిద్దమవుతున్నారు. పాలేరు బిడ్డను..ఇక్కడ నుంచే పోటీ చేస్తానని.. ఆమె మట్టి పట్టుకొని మరీ మాట ఇచ్చారు.షర్మిల ఒంటరిపోరుకు దిగితే.. ఖచ్చితంగా పాలేరు నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అప్పుడు ఎవరిని ప్రత్యర్ధిగా చూస్తారనేది ఆసక్తికర అంశంగా మారింది. బీఆర్ఎస్‌ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని టార్గెట్‌ చేస్తారా..? లేదంటే పాలేరు టికెట్‌ ఆశిస్తున్న తుమ్మల నాగేశ్వరరావుతో ఫైట్ చేస్తారా? ఒకవేళ తుమ్మల గనక ఖమ్మం సీటు తీసుకుని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు బరిలో దిగితే మాత్రం.. పోటీ మరింత రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇక్కడ తీవ్ర పోటీ నెలకొంది. పాలేరు సీటు కోసం షర్మిల, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి ఆశ పెట్టుకున్న షర్మిల, ఏకంగా తన పార్టీనే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. అటు క్లియర్‌ క్లారిటీతో తన అనుయాయులతో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాలేరు నుంచి పోటీకి సై అంటున్నారు. ఇక ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి, భంగపడిన మరో సీనియర్‌ నేతల తుమ్మల నాగేశ్వరరావు కూడా పాలేరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్‌లో పాలేరు టిక్కెట్‌ పంచాయితీ బెంగళూరుకు చేరింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్