YS Sharmila: ఏపీలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్‌కు తెరలేపిన వైసీపీ, టీడీపీ పోటాపోటీగా ముందుకెళ్తున్నాయి. ఇక ఏపీ కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో ప్రచారాన్ని ప్రారంభించనుంది.
ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది హస్తం పార్టీ. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నేడు విజయవాడలో ప్రారంభించనున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల హామీలైన డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఏపీ కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు.