Tuesday, January 27, 2026

షర్మిళ పొలిటికల్ రిటైర్మెంట్  బెటరా.

- Advertisement -

షర్మిళ పొలిటికల్ రిటైర్మెంట్  బెటరా.

Sharmila's political retirement is Better.

విజయవాడ, డిసెంబర్ 24, (వాయిస్ టుడే)
వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చి తప్పు చేశారా? అన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచే వినపడుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు తెలంగాణ వైఎస్సార కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం ఆమె నేరుగా టీపీసీసీ చీఫ్ అయ్యారు. అయితే వైసీపీ అధినేత జగన్ కు చెక్ పెట్టడానికే ఆమెను అంత పెద్ద పదవిని అప్పగించారని భావించిన సీనియర్ నేతలు ఆమెకు సహకరించడం మానేశారు. ప్రజలు కూడా మొన్నటి ఎన్నికల్లో పట్టించుకోలేదు. ఫలితంగా ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయగా పార్టీని బలోపేతం చేస్తారని భావించినా హైకమాండ్ అంచనాలు తప్పయ్యాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కోలుకోలేదన్న దానికి మొన్నటి ఎన్నికలే నిదర్శనమని చెప్పక తప్పదు. షర్మిల రాకతో ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆమెను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజికవర్గం పరంగా కూడా పార్టీకి ఇబ్బంది కరంగా మారడంతో ఆమెను తప్పించి మరొకరికి ఈ పదవి అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల పనితీరుపైన కూడా సీనియర్ నేతల నుంచి కిందిస్థాయి క్యాడర్ వరకూ అసహనంతో ఉన్నట్లు ఢిల్లీ పెద్దలు గుర్తించారు. పార్టీ కార్యక్రమాలను చేపట్టినా ఎవరికీ సమాాచారం ఇవ్వకుండా అంతా సోలోగానే చేస్తున్నారని, కేవలం తన చుట్టూ ఉన్న కోటరీ నేతలతోనే ఆమె మాట్లాడి కార్యక్రమాలను రూపొందిస్తున్నారని పార్టీ హైకమాండ్ కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో షర్మిలకు పదవి కంటిన్యూ చేయడంపై పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడిందంటున్నారు. అందుకే కార్యక్రమాలకు కూడా సీనియర్ నేతలు ఎవరూ హాజరు కావడం లేదంటున్నారు. వైఎస్ జగన్ పైన చేసే విమర్శలు కూటమి ప్రభుత్వంపై చేయకపోవడం కూడా వైఎస్ షర్మిలకు మైనస్ అని, బీజేపీతో పొత్తుతో ఉన్న చంద్రబాబు సర్కార్ పట్ల షర్మిల కొంత సానుకూల ధోరణిని కొనసాగించడం పార్టీకి దీర్ఘకాలంలో నష్టమని కొందరు హైకమాండ్ పెద్దలకు సూచించినట్లు తెలిసింది. దీంతో ఆమెను ఆ ప్లేస్ నుంచి తప్పించి కొత్త వారిని ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇకొంత కాలం వెయిట్ చేసి కొత్త పీసీసీ చీఫ్ నేతను ఎంపిక చేస్తారంటున్నారు.మరోవైపు ఇండి కూటమి వైపు జగన్ చూాడాలన్నా ఆ ప్లేస్ లో షర్మిల ఉండకూడదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతుందని తెలిసింది. చంద్రబాబు ఎటూ బీజేపీని వదిలి బయటకు రారు. ఈ నేపథ్యంలో ఏపీలో కనీస స్థానాలను కైవసం చేసుకోవాలంటే జగన్ ను మంచి చేసుకోవడం మంచిదన్నఅభిప్రాయంలోనూ కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. షర్మిలను తప్పించి ఆ పదవిలో జగన్ కు కొంత సానుకూలమైన ఉన్న నేతను పెడితే కొంత వరకూ తమ దారికి తెచ్చుకోవచ్చన్నఅభిప్రాయం కూడా ఉంది. జగన్ కుటుంబంలో విభేదాలు తారా స్థాయికి చేరడంతో పాటు అవి ఆస్తి తగాదాలు కావడంతో అన్నా చెల్లెల్లు భవిష్యత్ లో ఒక్కటి కావడం కష్టమేనని, అందుకే మరో నేతకు పగ్గాలు అప్పగిస్తే ఇటు జగన్ తో సఖ్యతను కొనసాగించి వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీతో పొత్తుకు అవకాశం కల్పించేలా హైకమాండ్ అడుగులు వేస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఆయనకు అత్యంత సన్నిహతులైన కాంగ్రెస్ నేతల పేర్లను అదినాయకత్వం పరిశీలిస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే ఈసారి కాపు సామాజికవర్గానికి పీసీసీ చీప్ పదవి దక్కే అవకాశాలున్నాయన్న లెక్కలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకూ బీసీ, ఎస్సీ,బ్రాహ్మణ, రెడ్డి సామాజికవర్గాలకు మాత్రమే పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు.తొలి ఏడాది రఘువీరారెడ్డి, తర్వాత సాకే శైలజానాధ్, తర్వాత గిడుగు రుద్రరాజు అనంతరం వైఎస్ షర్మిలను నియమించారు. ఈసారి కాపు సామాజికవర్గానికి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిసింది. కాపుల్లో సీనియర్ నేతలకు పీసీసీ చీఫ్ పదవి అప్పగిస్తే ఆ ఓటుబ్యాంకు కోసమైనా జగన్ పొత్తుకు ముందుకు వచ్చే అవకాశముందని కూడా హస్తం పార్టీ ఎత్తుగడగా వినిపిస్తుంది. అయితే కాపు సామాజికవర్గంలో అంత బలమైన నేత ఉభయ గోదావరి జిల్లా నుంచే ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో కూడకా ఉంది. ఈ పరిస్థితుల్లో వైెఎస్ షర్మిలకు త్వరలోనే పదవీ గండం తప్పదన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిలకు అవసరమైతేే ఏఐసీసీలో ఒక పదవి అప్పగించి పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించాలన్న యోచనలో కూడా నాయకత్వం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద వైఎస్ షర్మిల సోదరుడిపై పోరాటంలో విఫలం కావడంతో ఆమెను తప్పించాలన్న నిర్ణయానికి కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చిందంటున్నారు. మరి ఏం జరుగుతుందోచూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్