ఇడుపులపాయ వైఎస్సార్  ఘాట్ వద్ద షర్మిల ప్రత్యేక ప్రార్థనలు

- Advertisement -

ఇడుపులపాయ వైఎస్సార్  ఘాట్ వద్ద షర్మిల ప్రత్యేక ప్రార్థనలు
కడప
ఏపీసీసీ ఛీఫ్, కడప కాంగ్రెస్ అభ్యర్ది షర్మిల శనివారం తన నామినేషన్ దాఖలు చేసారు. అంతకుముందు
నామినేషన్ పత్రాలను ఇడుపులపాయ వైఎస్సార్  ఘాట్  వద్ద పెట్టి నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్థనల్లో బ్రదర్ అనిల్ కుమార్, డాక్టర్ సునీతా రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ – కడప ఎంపీ అభ్యర్థిగా ఇవ్వాళ నామినేషన్ వేస్తున్నాం.  నాన్న దగ్గర నామినేషన్ పత్రాలు పెట్టీ ఆశీర్వాదం తీసుకున్న.  కడప ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు.  అన్ని అర్థం చేసుకో గలిగిన వాళ్ళు.  అన్ని అర్థం అవుతున్న వాళ్ళు.  కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్న. కడప ప్రజలు వైఎస్సార్, ,వివేకా ను ఇంకా మరిచి పోలేదు.  నాకు సంపూర్ణ నమ్మకం ఉంది.  అది నిరూపించుకునే సమయం ఆసన్నం అయ్యింది.  ఈ యుద్ధం యాహోవా ది.  భారీ మెజారిటీ తో గెలుస్తానని దృఢ నమ్మకం ఉందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular