- Advertisement -
మహిళలు, విద్యార్థులకు రక్షణగా షీ టీంలు- షీ టీమ్ ఇంచార్జ్ SI లావణ్య
She Teams for protection of women and students- She Team Incharge SI Lavanya
పెద్దపల్లి ప్రతినిధి: మహిళలు, విద్యార్థులకు రక్షణగా షీ టీంలు అండగా ఉంటూ సహకరిస్తాయని షీ టీమ్ ఇంచార్జ్ ఎస్ ఐ లావణ్య అన్నారు. సోమవారం పట్టణంలోని చింతలవాడలో గల రైసింగ్ సన్ స్కూల్ విద్యార్థులకు షీ టీంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా షీ టీం మెంబెర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923 700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలుపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు , లోన్ యాప్స్ పేరు తో మోసాలకు గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని తెలిపారు. అమ్మాయిలకు ఎలా జాగ్రత్తగా ఉండాలో వివరించారు. ఈ కార్యక్రమం లో షీ టీమ్ సభ్యులు సురేష్ , మౌనిక మరియు కరస్పండెంట్ సాయిద్ అహ్మద్, హెడ్ మాస్టర్ హకీమ్ ఖాన్, ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -