Saturday, February 15, 2025

శ్రీ శ్రీ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి కి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీ కొలుసు పార్థసారధి .

- Advertisement -

శ్రీ శ్రీ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి కి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి శ్రీ కొలుసు పార్థసారధి .

Shri Kolusu Parthasaradhi, the minister who presented silk clothes to Sri Sri Sri Sobhanachal Vyagra Lakshmi Narasimha Swami.

స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి.
మంత్రి కొలుసు పార్థసారధి…

ఆగిరపల్లి:జనవరి 4

ఆగిరపల్లి మండలం ఆగిరపల్లి గ్రామంలో  వేంచి ఉన్న శ్రీ శ్రీ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రధ సప్తమి వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగాయి
స్వామి  వారి రధ సప్తమి  ఉత్సవాలకు మంగళవారం ఉదయం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారధి మొదటిగా గ్రామ ప్రజలు నాయకులు పెద్దలు మహిళలు చిన్నారులు కోలాట భజనలతో భాజా భజింత్రాలతో మేల తాలాలతో బాణా సంచల వెలుగులతో పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు అనంతరం మంత్రి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తదనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేసిన మంత్రి అనంతరం మంత్రి కొలుసు పార్థసారధి కి దుశ్శాలువతో పూల దండలతో సన్మానించిన గ్రామ  పెద్దలు అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా అస్టైస్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారికి ప్రార్ధించానన్నారు వచ్చే ఏడాది స్వామి సన్నిధి మరింత అభివృద్ధి చేస్తామన్నారు, త్వరలో రూ,2 కోట్ల తో నిర్మించే ఘాట్ రోడ్డు ప్రారంభిస్తామన్నారు, స్వామి వారి సన్నిధిని సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామన్నారు, గ్రామంలో కల్వర్టు త్వరలో నిర్మిస్తానని,ప్రత్యేక నిధులతో సి, సి, రోడ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి అన్నారు, గతంలో  2014- 2019 ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకు కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత నాది అన్నారు, గ్రామంలో ఒక్క పూరిల్లు లేకుండా వచ్చే మార్చి నుండి రూ,3.50లక్షలతో పక్కా ఇళ్లు కట్టిస్తానని మంత్రి తెలిపారు
అర్హులైన అందరికీ పక్కా ఇళ్లు అర్హులైన అందరికీ పెన్షన్లు, అర్హులైన వికలాంగులందరికి పెన్షన్లు ఇప్పించే బాధ్యత నాది అని అన్నారు స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు,
ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరి కోసం  ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు.
నూజివీడు నియోజకవర్గ  ప్రజలు,  జిల్లా ,రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రంలోని, జిల్లాలోని ప్రతీ కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. అలాగే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు  ప్రజలు సహకరించాలన్నారు.కోరిన కోరికలు తీర్చే స్వామి శోభనాచల స్వామి
ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాలు తొలగి ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలన్నారు.  స్వామి వారి ఆశీస్సులతో పాడి పంటలు విరివిగా పండి రాష్ట్ర ప్రజానీకం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు స్వామి వారి చల్లని దీవెనలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉండి తద్వారా ప్రజలకు  మంచి పరిపాలన అందాలన్నారు.స్వామి వారి ఆశీస్సులతో  ప్రజలకు అంతా మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో  నాయకులు తెలుగుదేశం జనసేన కూటమి నాయకులు గ్రామ పెద్దలు భక్తులు, స్వామి వారి ఆశీస్సులు పొందారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్