తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుభం భన్సల్

- Advertisement -

తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శుభం భన్సల్

తిరుపతి
తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా నేటి శనివారం శుభం భన్సల్  జిల్లా కలెక్టరేట్ నందు బాధ్యతలు స్వీకరించారు. 2020 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన  వీరు తొలి పోస్టింగ్ రంపచోడవరం సబ్ కలెక్టర్ గా విధులు చేపట్టి పలు రకాల ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి జిల్లాలో జెసి గా పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, ఎన్నికలు పారదర్శకంగా సజావుగా జరుపుటలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పలు రెవెన్యూ అంశాలపై జెసి గారు అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డిసి శ్రీనివాసరావు, పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎఓ జయరాములు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నూతన జెసి కి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular