Friday, January 3, 2025

సిద్ధరామయ్య కార్నర్ మీటింగ్ … బాగ్ లింగంపల్లి

- Advertisement -

హైదరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాగ్ లింగం పల్లిలో నిర్వహిస్తున్న కార్నర్ మీటింగ్ కు హాజరైన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య .

సిద్ధరామయ్య కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్నర్ మీటింగ్ @బాగ్ లింగంపల్లి

ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కు అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నాను

 

నవంబర్ 30 న తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించాలి

 

గత 10 ఏళ్లుగా ప్రజలను కేసీఆర్ వంచించాడు , మోసం చేశాడు

 

అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు

 

ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపి , కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి

 

దేశంలో అన్ని వర్గాలను , అన్ని కుల మతాల ప్రజల సంక్షేమం  కోసం పని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే

 

స్వాతంత్ర్య కోసం , పేద ప్రజలకు అధికారం ఇచ్చేందుకు బిజెపి పార్టీ ఎప్పుడు పని చేయలేదు

 

తెలంగాణ ప్రజల ఆకాంక్ష గౌరవించి కాంగ్రెస్ పార్టీ గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే

 

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రమేయం లేదు… పార్లమెంట్ లో ఆయనకు ఎంపీలు లేకపోయినా సోనియాగాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చింది

 

10 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎస్సి , ఎస్టీ , మహిళలు , రైతులకు , యువతకు ఎలాంటి న్యాయం చేయలేదు

 

రాష్ట్ర సంపదను కేసీఆర్ ఆయన కుటుంబం లూటీ చేశారు

తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర 75 వేల కోట్లు… 10 ఏళ్లలో కేసీఆర్ 5 లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పు చేశాడు

ఒక్కొక్కరి పై 95 వేల రూపాయల అప్పు చేశాడు

ముఖ్యమంత్రి కేసీర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేశాడు

ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు … ఆ రాజ్యాంగాన్ని 100 శాతం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ … దాన్ని తుంగలో తొక్కేది బిజెపి ,  బిఆర్ఎస్ పార్టీలు

 

రాజ్యాంగం కారణంగానే అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు లభిస్తున్నాయి… కానీ బిజెపి , బిఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్నాయి

 

నేను ముఖ్యమంత్రి అయింది , నరేంద్రమోదీ ప్రధాని అయ్యింది , కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది ఆ రాజ్యాంగం వల్లనే

 

రాజ్యాంగం లేకపోతే రాచరికం వస్తుంది… రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి , ఆ బాధ్యత ప్రతి ఒక పౌరుడిపై ఉంది

 

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే … ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ , బిజెపి ను  ఓడించి , కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి

 

బిఆర్ఎస్ , బిజెపి కు తేడా లేదు… రెండు పార్టీల వైఖరి ఒక్కటే

 

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు , వ్యాపారుల వద్ద పన్నులు తీసుకొని , ప్రజల వద్ద తక్కువ తీసుకొనే వాళ్ళము… కానీ ఇప్పుడు పేదల పై అధిక భారం వేసి… బడా బాబులకు రాయితీలు ఇస్తున్నారు

 

అంబాని , ఆధాని వద్ద నుండి కూడా కాంగ్రెస్ పార్టీ 30 శాతం పన్నులు వసూలు చేసేవాళ్ళము… కానీ నరేంద్రమోదీ వచ్చిన తరువాత 22 శాతానికి తగ్గించారు

 

తాము అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు తక్కువ ధరకు దొరికేవి , కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి

 

గతంలో గ్యాస్ 4 వందలు ఉండేది… కానీ ఇప్పుడు 12 వందలు అయింది

 

కర్ణాటక లో డీజల్ , పెట్రోల్ ధరల కంటే తెలంగాణ ఎక్కువ విక్రయిస్తున్నారు

 

ఈ డబ్బులన్ని కేసీఆర్ ఖాతాలోకి వెళ్తున్నాయి

 

పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది… అందుకే కర్ణాటక లో 5 గ్యారెంటీలు ఇచ్చాము

 

ఈ హామీలు ఇస్తే కర్ణాటక రాష్ట్ర దివాళా తీస్తుందని నరేంద్రమోదీ అన్నారు

 

 

కానీ ప్రధానికి ఛాలెంజ్ చేసి , ఇప్పుడు 4 గ్యారెంటీలు అమలు చేశాము… ఇంకో గ్యారెంటీ యువ నిధి పేరిట నిరుద్యోగులకు 3000 జనవరి నుండి అందజేసి , అది కూడా అమలు చేస్తాము

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారెంటిలను అమలు చేస్తుంది.

 

కర్ణాటక లో తాము అమలు చేస్తున్న గ్యారెంటీలు చేస్తున్న , ముఖ్యమంత్రి కేసీఆర్ , కేటిఆర్ లు అమలు కావడం లేదని అబద్ధాలు చెప్తున్నారు

 

వాళ్లకు ఛాలెంజ్ చేస్తున్న కర్ణాటక కు వచ్చి చూడాలి… కానీ వాళ్లకు కర్ణాటక వచ్చే ధైర్యం లేదు… అందుకే ప్రజలను మభ్యపెడుతున్నారు.

 

కేసీఆర్ , మోడీ కు ఒడిపోతామనే భయం ప్రారంభమైంది… బిఆర్ఎస్ కథ ముగిసింది ,  బిజెపి 3 సీట్లకు మించి రావు

 

తూర్పున సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో , రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కూడా అంతే నిజం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్