సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక -2024
Siddipet Police Commissionerate Annual Report -2024
పోలీస్ కమిషనర్ డాక్టర్. బి. అనురాధ
సిద్దిపేట
2024 సంవత్సరంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6233 కేసులు నమోదైనాయి
. 2023 సంవత్సరంలో 5931 కేసులు నమోదైనాయి, ఈ సంవత్సరం 5% నేరాలు పెరిగాయి.
ఈ సంవత్సరం 25 మర్డర్ కేసులు నమోదైనాయి,
2023 సంవత్సరంలో 13 కేసులు నమోదైనాయయని పోలీసు కమిషనర్ డాక్టర్ అనూరాధ వెల్లడించారు.
ఈ సంవత్సరం దొంగతనాల కేసులు 709 కేసులు నమోదైనాయి, దొంగలించబడిన సొత్తు 31,097,968 రికవరీ శాతం 40%,
2023 సంవత్సరంలో 670 కేసులు నమోదైనాయి దొంగలించబడిన సొత్తు 37,385,833 రికవరీ 43% సత్తు రికవరీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కేసుల డిటెక్షన్ పర్సంటేజ్ 60% చేయడం జరిగింది.
ఈ సంవత్సరం 91 పోక్సో కేసులు నమోదైనాయి,
2023 సంవత్సరంలో 89 కేసులు నమోదైనాయి,
ఈ సంవత్సరం రేప్ కేసులు 75 నమోదైనాయి,
2023 సంవత్సరంలో 73 కేసులు నమోదైనాయి,
ఈ సంవత్సరం 9 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనాయి, 2023 సంవత్సరంలో 5 కేసులు నమోదైనాయి,
ఈ సంవత్సరం 655 రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదైనాయి, 283 మంది చనిపోవడం జరిగింది, 561 మంది గాయస్తులైనారు,
2023 సంవత్సరంలో 540 కేసులు నమోదైనాయి, 260 చనిపోవడం జరిగింది, 480 మంది గాయస్తులైనారు.
ఈ సంవత్సరం మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 12,681 కేసులు నమోదు చేసి, 45 మందిని జైలు శిక్ష విధించడం జరిగింది.
2023 సంవత్సరంలో 9713 కేసులు నమోదు చేసి, 28 మందిని మందికి జైలు శిక్ష విధించడం జరిగింది.
ఈ సంవత్సరం 40 గంజాయి కేసులు నమోదైనాయి,
2023 సంవత్సరంలో 14 గంజాయి కేసులు నమోదైనాయి. గంజాయి ఇతర మత్తు పదార్థాలు వల్ల కలిగే అనర్ధాల గురించి గ్రామాలలో పట్టణాలలో 156 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పాన్ షాప్స్, కిరాణా షాప్, టీ కొట్లలో ఇతర అనుమానిత బహిరంగ ప్రదేశాలలో డాగ్స్ స్క్వాడ్ ద్వారా 162 ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది.
ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల నివారణ గురించి రాజీవ్ రహదారిపై అతి వేగంగా వెళ్లే వాహనాలపై స్పీడ్ లేజర్ గన్ ద్వారా ఈ సంవత్సరం 43,594 కేసులు నమోదు చేసి 45,076,390 జరిమానా విధించడం జరిగింది.
2023 సంవత్సరంలో 86,533 కేసులు నమోదు చేసి 8,95,27,414 జరిమానా విధించడం జరిగింది.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసులలో నేరస్థులకు 48% శిక్షలు విధించడం జరిగింది.
2023 సంవత్సరంలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసులలో నేరస్థులకు 47% శిక్షలు విధించడం జరిగింది.
ఈ సంవత్సరం ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై రవాణా చేసే వారిపై 219 కేసులు నమోదు చేసి 412 మందిని అరెస్టు చేయడం జరిగింది.
2023 సంవత్సరంలో ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.
క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్ కేసు ఈ సంవత్సరంలో క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్ కేసులు 562 నమోదైనాయి.
2023 సంవత్సరంలో 537 కేసులు నమోదు చేయడం జరిగింది.
199 సైబర్ కేసులు నమోదైనాయి, 69,61,586 డబ్బులు ఫ్రిజ్ చేయడం జరిగింది, 2023-2024 సంవత్సరాలు కలుపుకొని 80,58,718, డబ్బులను సంబంధిత బాధితులకు చట్ట ప్రకారం బాధితుల యొక్క అకౌంట్లకు రిఫండ్ చేయడం జరిగింది. మరియు సైబర్ నేరాల గురించి పోలీస్ అధికారులు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ సంవత్సరంలో జూదం పేకాట ఆడిన వారిపై 80 కేసులు నమోదు చేసి 511 మందిని అరెస్టు చేసి 17,34,968 రూపాయలు సీజ్ చేయడం జరిగింది.
2023 సంవత్సరంలో 26 కేసులు నమోదు చేసి 162 మందిని అరెస్టు చేసి 8,51,895 రూపాయలు సీజ్ చేయడం జరిగింది.
ఈ సంవత్సరం డయల్ 100 కాల్స్ 41,582
ఈ సంవత్సరం ఎంక్వయిరీ చేసిన పాస్పోర్ట్లు 9255.
ఈ పెట్టి కేసులు, మరియు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించే వారిపై నమోదు చేసిన కేసుల వివరాలు, చిన్నచిన్న తప్పులు ఉన్నప్పుడే వాటిని కట్టడి చేస్తే పెద్ద నేరాలు జరిగే అవకాశం ఉండదు, పెద్ద నేరాలు జరగకుండా నివారించడానికి ఈ పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది.
ఈ పెట్టి కేసు ద్వారా నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు ఈ సంవత్సరం 3,150 ఈపెట్టి, కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించే వారిపై 1421 కేసులు నమోదైనాయి.
ఈ సంవత్సరంలో ప్రభుత్వం నిషేధించిన గుట్కా పాన్ పరాగ్ జర్దా ఇతర వాటిపై 32 కేసులు నమోదైనాయి.
2023 సంవత్సరంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
ఈ సంవత్సరంలో నకిలీ, మరియు కల్తీ విత్తనాలపై 3 కేసులు నమోదైనాయి.
2023 సంవత్సరంలో 1 కేసు నమోదయింది.
ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై రైట్ చేసి 404 కేసులు నమోదు చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో 369 కేసులు నమోదు చేయడం జరిగింది.
ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డెన్ అండ్ సెర్చ్ ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ 19 నిర్వహించడం జరిగింది.
2023 సంవత్సరంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్ నిర్వహించలేదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన టెక్నాలజీ సి ఈ ఐ ఆర్, ద్వారా పడిపోయిన ఇతరులు దొంగలించిన సెల్ ఫోన్స్ ఈ సంవత్సరం 1369 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగింది.
2023 సంవత్సరంలో 293 ఫోన్లు రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగింది.
జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా ఈ సంవత్సరంలో 21,249, కేసులు పరిష్కరించడం జరిగింది.
2023 సంవత్సరంలో 6,790 కేసులు పరిష్కరించడం జరిగింది.
ఈ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు ఇతర అత్యవసర ఆపరేషన్ సమయాలలో చికిత్స పొందుతున్న వారికి వెంటనే స్పందించిన 351 యొక్క మంది పోలీస్ అధికారులు సిబ్బంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది.
ట్రాఫిక్ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపిన వాహనదారులపై ఈ సంవత్సరం 3,45,816 కేసులు నమోదు చేయడం జరిగింది.
2023 సంవత్సరంలో 4,89,016 కేసులు నమోదు చేయడం జరిగింది.
ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ రేషన్ బియ్యం అక్రమంగా దాచిపెట్టిన రవాణా చేసిన వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి 145 కేసులు నమోదు చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో 11 కేసులు నమోదు చేయడం జరిగింది.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 499 గ్రామపంచాయతీలలో 5 మున్సిపాలిటీలలో నేను సైతం, మరియు కమ్యూనిటీ ద్వారా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తుల, సహాయ సహకారాలతో 7245 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, సీసీ కెమెరాలు ద్వారా వివిధ రకాల 58 కేసులను ఛేదించడం జరిగింది.
సిద్దిపేట జిల్లాలో 18 సంవత్సరాల లోపు పిల్లలు అఘాయిత్యాలకు గురైతే భరోసా సెంటర్ ద్వారా మహిళలకు మరింత సత్వరమైన సేవలు అందించడం, భరోసా కల్పించడం జరుగుతుంది.
స్నేహిత మహిళ సపోర్ట్ సెంటర్ లో మహిళలు ఇంట్లో బయట వేధింపులకు గురిఅయిన భార్య భర్తలకు మరియు కుటుంబ సభ్యులకు 866 కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలికల మరియు మహిళల రక్షణ గురించి 3 షీటీమ్స్ ద్వారా మహిళల బాలికల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, ఈవిటీజింగ్, సమాజ రుగ్మతల గురించి, ప్రభుత్వ కళాశాలలో మరియు స్కూళ్లలో బస్టాండ్లలో తదితర ప్రాంతాలలో 337 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
మహిళ పోలీస్ స్టేషన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో 595 దరఖాస్తులు రాగా భార్య భర్తలకు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి 577 దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో కనువిప్పు కళాబృందం కార్యక్రమము ద్వారా మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, వరకట్నం మరణాలు తదితర సమాజ రుగ్మతల గురించి 174, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. మరియు దానిని పకడ్బందీగా అమలు పరచడం జరుగుతుంది.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో, కమిషనర్ కార్యాలయంలో 5ఎస్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దానిని ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది. పోలీస్ అధికారుల సిబ్బంది 1429 మందికి ఆరోగ్య పరిరక్షణ గురించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సిద్దిపేట మెడికల్ కాలేజ్ డాక్టర్లతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆరోగ్య పరిరక్షణ గురించి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. మరియు రెండు సంవత్సరాల పాటు సిద్దిపేట మెడికల్ కాలేజ్ డాక్టర్లు, ప్రొఫెసర్లతో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం గురించి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది.
2024 లోక్ సభ ఎన్నికలు ఇన్సిడెంట్ ఫ్రీ, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన వారిపై 25 కేసులు నమోదైనాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకొని వెళుతున్న వ్యక్తుల వద్ద నుండి 66,10,840 డబ్బులు సిజ్ చేయడం జరిగింది.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 525 విపిఓ బుక్స్ అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించడం జరిగింది. ప్రతి గ్రామానికి సంబంధించిన పూర్తి సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్ సందర్శించినప్పుడు సంబంధిత విపిఓ బుక్స్ తనిఖీ చేయడం అందులో ఉన్న సమాచారాన్ని పరిశీలించడం జరుగుతుంది.
2025 సంవత్సరంలో చేయు కార్యక్రమాలు.
గంజాయి, డ్రగ్స్, కొకేన్ లాంటి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి ఇతర మత్తుపదార్థాల రహిత జిల్లాగా మార్చడం గురించి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుంది.
మహిళలకు బాలికలకు సంబంధించిన కుటుంబ సమస్యలను, కేసులను ఒకే దగ్గర పరిష్కారమయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మరియు సైబర్ నేరాలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.