- Advertisement -
సిద్ధు జొన్నలగడ్డ, రవికాంత్ పెరెపు, రానా దగ్గుబాటి ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల
Sidhu Jonnalagadda, Ravikant Perepu, Rana Daggubati's 'Its Complicated' releases in theaters on February 14
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ చిత్రం కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్, ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు.ఇప్పుడు, రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది – ఈ సినిమా టైటిల్‌ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’గా మార్చారు. ఈ కొత్త టైటిల్ మరింత ఆసక్తిని జోడించడమే కాకుండా, సినిమా కంటెంట్ కి పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పెరెపు ఓ హిలేరియస్ వీడియోతో ఈ అనౌన్స్మెంట్ చేశారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ గురించి కూడా హింట్ ఇచ్చారు.
ట్యాలంటెడ్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకి షానియల్ డియో, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు డీవోపీగా పని చేశారు, ఇట్స్ కాంప్లికేటెడ్ హ్యుమర్, ఎమోషనల్ హై అందిస్తుందని ప్రామిస్ చేస్తోంది.
- Advertisement -