Thursday, December 12, 2024

కాంగ్రెస్‌కు చేతగాక సింగరేణిని సమైక్య చేతల చేతుల్లో పెట్టారు: కెసిఆర్

- Advertisement -

రామగుండం నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలోసిఎం కెసిఆర్

రామగుండం నవంబర్ 24:  కాంగ్రెస్‌కు చేతగాక సింగరేణిని సమైక్య చేతల చేతుల్లో పెట్టారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సింగరేణి 134 ఏళ్ల కింద పుట్టిన మన సొంత కంపెనీ. నిజాం రాజు కాలంలో పుట్టిన కంపెనీ. మన సొంత ఆస్తి. ఈ కాంగ్రెస్‌ దద్దమ్మ నాయకులకు చేతగాక సమైక్య నాయకుల చేతిలో పెడితే కేంద్రం దగ్గర అప్పులు తెచ్చారు. రూ.600కోట్ల మారటోరియం సింగరేణి మీద ఉండేది. ఆ అప్పులు కట్టుడు చేతగాక మా వళ్లకాదని చేతులెత్తేసి కేంద్రానికి 49శాతం వాటా పుట్టించారు. మన సింగరేణి వందశాతం మనకే ఉంటుండే. అలా లేకుండా చేసిందే కాంగ్రెస్‌’ అంటూ విమర్శించారు. ‘తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్‌. గోదావరి ఒరుసుకుంటు పారే మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో మంచినీళ్ల గోస, కరెంటు గోస. చేనేత కార్మికుల చనిపోవుడు. రైతులు ఆత్మహత్యలు చేసుకునుడు. కరెంటు ఇస్తే తెల్లందాక ఇంత. పొద్దందాక ఇంత. ఆడ పాములు కరిచి చనిపోవుడు. విపరీతమైన బాధలు పడ్డాం. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఉండే. వాటిని ఊడగొట్టింది కాంగ్రెస్సే కదా? గవర్నమెంట్‌ కాంగ్రెస్సే. ఒప్పందాలపై సంతకాలు పెట్టి ఉన్న హక్కులను పోగొట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించుకున్నాం. అంతేకాకుండా 15వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. మీ కండ్ల ముందు జరిగిన చరిత్ర. అనేక కారణాలు ఉన్నయ్‌. కాంగ్రెస్‌ వాళ్లు ఉన్నప్పుడు ఇవ్వలేదు. మేం ఇస్తుంటే ఓరుస్త లేరు’ అంటూ విమర్శించారు.

కులం, మతం లేకుండా కలుపుకుపోతున్నాం..

‘ఎన్నో ఏండ్ల నుంచి ప‌రిష్కారం కానీ స‌మ‌స్యలు ప‌రిష్కారం అవుతున్నాయి. అన్ని వ‌ర్గాల‌ను, కులం మ‌తం అనే తేడా లేకుండా క‌లుపుకొని ముందుకు తీసుకుని పోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే మీరు మంచి ప‌ద్ధతుల్లో ఆలోచ‌న చేసి ఓటేస్తే మంచి జ‌రుగుతది. చంద‌ర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఉద్యమ‌కారుడు. ఉద్యమ కాలంలో 74 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయ‌న కూడా సింగ‌రేణి కార్మికుడి కుమారుడు. కాబ‌ట్టి సింగ‌రేణి గురించి బాగా అవ‌గాహ‌నం ఉంది. ఇక బొగ్గు, నీళ్లు ఉన్నాయి. ర‌వాణా వ‌స‌తి ఉంది. ట్రైన్ కూడా ఉంది. మాకు ప‌రిశ్రమ‌లు లేవు అని చంద‌ర్ చెప్పారు. రామగుండం నిర్లక్ష్యానికి గురైంది స‌మైక్య రాష్ట్రంలో. మ‌నం ఇప్పుడు కుదుట‌ప‌డ్డాం. ఈ ప్రాంతానికి రావాల్సిన ప‌రిశ్రమ‌ల గురించి ఆలోచించి తీసుకువ‌స్తాం. దాని కోసం నేను కృషి చేస్తాను’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్