- Advertisement -


సింగరేణి వ్యాపతంగా కార్మికుల కు 11వ వేజ్ బోర్డుకు సంబంధించి 23 నెలల పెరిగిన బకాయి వేతనాలు ఓకేదఫా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం లొని సింగరేణి హెడ్ ఆఫీసు ఎదుట సింగరేణి AITUC ఆధ్వర్యంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా . సీపీఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులు రాత్రనక పగలనక కష్టపడి పని చేస్తుంటే కార్మికులకు ఇవ్వాల్సిన బోనసులు, ఏరియాస్ సరిగా చెల్లించకపోవడంపై తీవ్ర అసంతృప్తి గా కార్మికులు ఉన్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త బొగ్గు గాని కూడా ప్రారంభించపొగ ఉన్న కార్మికుల్ని తొలగిస్తూ వారి కష్టాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
- Advertisement -



