సింగరేణి కార్మికులపై యాజమాన్యం కక్ష సాధింపు మానుకోవాలి
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
రామగుండం
రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పేరిట సింగరేణి కార్మికులను యాజమాన్యం వేధిస్తుందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంటు పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరిఖని ప్రాంతంలో సింగరేణి క్వాటర్లు కోల్పోతున్న సింగరేణి కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పేరిట గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న సింగరేణి కార్మికులకు సంబంధించిన క్వార్టర్లను యాజమాన్యం కూల్చివేయడం సరికాదని అన్నారు. కార్మికులకు ఎలాంటి సదుపాయాలు లేని క్వార్టర్లను కేటాయిస్తున్నారని, వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకుంటే సింగరేణి కార్మికుల పక్షాన తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు.
సింగరేణి కార్మికులపై యాజమాన్యం కక్ష సాధింపు మానుకోవాలి
- Advertisement -
- Advertisement -