- Advertisement -
సిద్దిపేట జిల్లాలో ఆఖరి మజిలీ కోసం అవస్థలు
సిద్దిపేట: చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం గ్రామస్తులు, బంధువులు ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ ఈదుకుంటు వెళ్లారు. చేర్యాల (మం) వేచరిణి గ్రామంలో ఘటన జరిగింది. గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ బాలయ్య మృతిచెందాడు. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామంలో వాగు ఉప్పొంగింది. స్మశాన వాటిక వాగు అవతలి వైపు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగు దాటి అంత్యక్రియలు చేసారు. గతంలో బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నా ఇంతవరకు పని కాలేదని అంటున్నారు.
- Advertisement -