- Advertisement -
ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థల పరిశీలన
Site examination for establishment of industrial park సూర్యాపేట
తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామ శివారులోని 365 జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు శుక్రవారం ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి స్థల పరిశీలన చేశారు
ఎమ్మెల్యే మాట్లటాడుతూ ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం తన కల. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఐటీఐ కళాశాలల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తా. ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి. త్వరలో ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి శంకుస్థాపన చేస్తాం.. ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెడితే బాగుంటుందని విషయంపై చర్చించారు. ఈ మేరకు పక్కనే ఉన్న రుద్రమ్మ రిజర్వాయర్ ను తిలకించారు.
- Advertisement -




