ఆరు గ్యారంటీల అడుగులు
హైదరాబాద్, డిసెంబర్ 27
ఆరు గ్యారంటీలను హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని అమలు చేయడానికి మొదటి అడుగు వేస్తున్నది. ఈ నెల 28 నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగే గ్రామ సభల్లో అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది. జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలూ కవర్ అయ్యేలా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజా పాలన ప్రోగ్రామ్ గురించి వివరించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసిన తర్వాత ఆరు గ్యారంటీల్లో దేని కింద అర్హత లభిస్తుందో అధికారులు తేల్చనున్నారు. యువ వికాసం మినహా మిగిలిన గ్యారంటీలకు అర్హత ఉన్నవారిని గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్ వేర్ను వినియోగిస్తున్నది.ప్రభుత్వం ప్రస్తుతం ఇవ్వాలనుకుంటున్న ఐదు గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ను తీసుకోనున్నది. దరఖాస్తుదారుల వివరాలను అందులో భర్తీ చేస్తున్నందున వాటిని ప్రామాణికంగా తీసుకుని ఇందులో ఏ గ్యారంటీ స్కీమ్ కింద అర్హత లభిస్తుందో అధికారులు వాటిని పరిశీలించిన తర్వాత ఖరారు చేయనున్నారు. ప్రతీ గ్యారంటీకి నిర్దిష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేయనున్నది. అవి వచ్చిన తర్వాత వాటికి అనుగుణంగా దరఖాస్తుల విశ్లేషణ, పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ కానున్నది.ప్రస్తుతం ఈ ఐదు గ్యారంటీలకు వైట్ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దరఖాస్తుల్లో దీనితో పాటు ఆధార్ కార్డు వివరాలను కూడా పొందపర్చాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కంప్యూటరైజ్ చేసిన తర్వాత పరిశీలన సమయంలో ఏ గ్యారంటీ కింద ఏ దరఖాస్తుదారు ఫిట్ అవుతారో క్లారిటీ రానున్నది.వైట్ రేషన్ కార్డు నెంబర్ను విధిగా దరఖాస్తు ఫారంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కార్డు లేకపోయినా దరఖాస్తును సమర్పించడానికి ఎలాంటి ఆంక్షలు లేవు. స్క్రూటినీ సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.ఐదు గ్యారంటీల లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలను నిర్దిష్టమైన మార్గదర్శకాల రూపంలో ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో వెల్లడించనున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి వర్తిస్తాయా లేవా అనేది త్వరలో స్పష్టత రానున్నది. దరఖాస్తు చేయడానికి మాత్రం ఆంక్షలు ఉండవు.ప్రభుత్వ పేదలకు మాత్రమే సంక్షేమాన్ని అందించాలని భావిస్తున్నది. అట్టడగున ఉన్నవారికి, చివరి వరుసలోని నిరుపేదలకు ప్రభుత్వం సాయం చేయాలని నొక్కిచెప్పినందున ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారికి గ్యారంటీలను అమలు చేయడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు
ఆరు గ్యారంటీల అడుగులు
- Advertisement -
- Advertisement -