- Advertisement -
తిరుపతి లో తొక్కిసలాట ఆరుగురు మృతి
Six killed in stampede in Tirupati
తిరుపతి,
తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో బుధవారం అర్ధరాత్రి అపశ్రుతి చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట జరిగింది. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకో గా, శ్రీనివాసం వద్ద తమిళ నాడు సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందారు.
బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ వద్ద ఉన్న కేంద్రంలో జరిగిన తోపులాటలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు.
రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. స్విమ్స్ ఆస్ప త్రిలో చికిత్సపొందుతూ మరో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మొత్తంగా తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. అదే విధంగా సత్యనారాయణ పురంలోని టోకెన్ల జారీ కేంద్రం వద్ద సైతం తోపు
లాట చోటు చేసుకుంది.
భక్తుల రద్దీతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే టోకెన్ల జారీకి నిర్ణయించారు. భక్తులు భారీగా తరలి రావడంతో టోకెన్ల జారీ ప్రారంభించామని,టీటీడీ ఈవో అన్నారు.
భక్తుల రద్దీని అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్దకు అదనపు బలగాలను తరలించారు. ఏర్పాట్లు సరిగా చేయలే దని భక్తుల ఆగ్రహం: కాగా వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు రోడ్లపై గుమికూడకుండా సిబ్బంది పార్కులో ఉంచారు.
పద్మావతి పార్కు నుంచి భక్తులను క్యూలైన్లలోకి వదిలారు. భక్తులను క్యూలై న్లలోకి వదిలే సమయంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసు కుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయకపోవ డంతో తోపు లాట జరి గింది.
టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగా చేయలేదని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ వద్ద షెడ్లు వేసి భక్తులను ఉంచారు.
- Advertisement -