- Advertisement -
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం నాడు మొదటి రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆరు నామినేషన్లు దాఖలుఅయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి మొదటి రోజు రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఎదురుగట్ల చిట్టిమల్లు, ఆమ్ అధ్మీ పార్టీ అభ్యర్థిగా పసుమర్తి శ్రీను నామినేషన్ దాఖలు చేసారు. కొత్తగూడెం నియోజకవర్గం లో రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా గుండపనేని సతీష్, ఆజాద్ అధికార సేన్ పార్టీ నుండి ఇమంది ఉదయ్ కుమార్ , ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యత కేంద్ర మార్క్సిస్ట్ లేనినిస్ట్ పార్టీ అభ్యర్థి పోలేబోయిన రవికుమార్ నామినేషన్ దాఖలు చేసారు.
- Advertisement -